శ్రీకాకుళం

పొందూరు ఎంపిడిఓ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 22: జిల్లాలోని పొందూరు మండల పరిషత్ అభివృద్ధి అదికారి సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేస్తూ పంచాయతీ రాజ్ , ఆర్డి కమీషనర్ రామాంజనేయులు ఉత్తర్వులు శనివారం జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ నుంచి జెడ్పి సీ ఈవో కు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు జరుపుతున్న ప్రభుత్వ పథకాల అమలుల్లో వైఫల్యం చెందడంతో పాటు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువుకావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎంపిడివో ఎన్.జి.వి సుబ్రహ్మణ్యంపై సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీకి చెంది ఉండగా ఎంపిపి సువ్వారి దివ్య వైసిపి తరపున ప్రాతినిత్యం వహిస్తున్నారు. అర్హులైన పింఛన్లను జన్మభూమి కమిటీ ద్వారా అన్యాయంగా రద్దు చేయించారని ఎంపిపి సువ్వారి దివ్య కోర్టును ఆశ్రయించడంతో పింఛన్లు పునరుద్దరించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ కోర్టును ఆశ్రయించిన వృద్ధులకు పింఛన్లు పంపిణీ కాలేదు. దీనిపై కూడా కోర్టు దిక్కారం కింద ఎంపిడివోపై ఎంపిపి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బురిడి కంచరాం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరయిన నిధులను పక్కదోవ పట్టించిన విషయంపై కూడా ప్రభుత్వం ఎంపిడివో చర్యను తప్పుపట్టింది. ఇటీవలి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ , ఆర్డి కమీషనర్ రామాంజనేయులు సమీక్ష సమావేశంలో ఎంపిడివో పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విధితమే. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ప్రభుత్వానికి పొందూరు ఎంపిడివోపై వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం వలన పంచాయితీ రాజ్ కమీషనర్ సస్పెండ్ చేసినట్లు అధికార వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఎంపిడివో సస్పెన్షన్‌పై జిల్లాలోని అధికారులు ఒకింత కలవరపడుతున్నారు.

నరకం చవిచూశాం!
* లిబియా ఉగ్రవాదుల తీరుపై గోపీకృష్ణ

టెక్కలి, అక్టోబర్ 22: లిబియా దేశస్థుల చేతిలో బందీగా ఉన్నంతకాలంగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామని టెక్కలికి చెందిన గోపీకృష్ణ అన్నారు. శనివారం స్వగృహానికి చేరుకున్న ఆయనను రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్‌నాయుడులు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కిడ్నాప్ జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదుల చెర నుంచి విడుదల కావడం ఆనందాయకమన్నారు. బందీగా వున్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపిన చొరవ పట్ల గోపీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు గోపీకృష్ణ విలేఖరులతో మాట్లాడారు. తీవ్రవాదుల చెరలో ఉన్నంతకాలం 60 రోజులుగా పూర్తిస్థాయి కమ్యూనికేషన్ ఉన్నప్పటికి 61 రోజులు తర్వాత ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేకుండా చేశారన్నారు. వారు పెట్టిన ఆహారం బతకడానికి తిన్నామన్నారు. 60 రోజులు తర్వాత తమకు వీడియో ఫోటోలు వేర్వేరుగా తీయడంతో బతుకుదామని ఆశ కూడా పోయిందన్నారు. ఏడాదిన్నర కాలంపాటు తమకు చిత్రహింసలు పెట్టలేదని, చివరి రోజుల్లో తాగునీటికీ కూడా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్రవాదులకు అమెరికా సైన్యం నీటి సరఫరాలో ఇబ్బందులు పెట్టడంతో జూన్ నుంచి తమపై ప్రత్యేక దృష్టి చూపించలేదన్నారు. అటు తర్వాత ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసేవారన్నారు. అమెరికా దాడులు చేయడంతో తమను విడిచిపెట్టి వారు పారిపోయారన్నారు. తమను తాము రక్షించుకోవడానికి నానా అవస్థలు పడి, చివరికి అమెరికా సైన్యానికి పట్టుబడ్డామన్నారు. తమను విడిపించేందుకు కృషి చేసినవారికి అభినందనలు తెలిపారు. వారితోపాటు ఎంపిపి సుందరమ్మ, ఎంపిటిసి రాము, వార్డు మెంబర్లు బుజ్జి తదితరులు పాల్గొన్నారు.