శ్రీకాకుళం

శ్రీకాకుళం కార్పొరేషన్‌కు కాసుల వర్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 7: శ్రీకాకుళం నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి 60 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమాత్యుడు డాక్టర్ పి.నారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో వుడా, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో వుడా, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నిర్మించిన రోడ్లు, డ్రైనేజ్‌ల సదుపాయాల విషయమై మంత్రి సమీక్షించారు. జిల్లాలో పందులు బెడద లేకుండా బ్లూక్రాస్ సొసైటీతో కలిసి తీసుకుంటున్న చర్యలపై మున్సిపల్ కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. నగరంలో అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించే పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, వర్షం నీరు నిల్వ ఉండకుండా తీసుకునే చర్యలు, నగరంలో ఎల్.ఇ.డి. బల్బుల వినియోగం తదితర అంశాలపై సమీక్షించారు. తక్కువ వ్యయంతో జరిగే పనులను త్వరితగతిన చేయాలన్నారు. నగరపాలక సంస్థలో పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ఉపకార్యనిర్వాహఖ ఇంజనీరు, సహాయ ఇంజనీర్ల పోస్టులను తయణం భర్తీ చేస్తామని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చిన్నబజార్ రోడ్డు నిర్మించిన అతి తక్కువ కాలంలోనే అధ్వానంగా తయారు అయ్యిందన్నారు. దీనిని నిర్మించిన కాంట్రాక్టర్, ఇంజనీర్లపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 10 లక్షల రూపాయల లోపు వ్యయంతో చేపట్టే పనులను సైతం నిబంధనల పేరుతో దీర్ఘకాలం కొనుసాగించుతున్నారని, దీనిని సరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 80 అడగుల రహదారిని సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారని, ఆ మేరకు పనులు చేపట్టాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులు ఎనిమిది కోట్ల రూ.లు రావల్సివుందని, దానిని విడుదల చేయాలని మున్సిపల్ మంత్రి నారాయణను కోరారు. ఈ సమీక్షా సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎం.పి. రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం, మున్సిపల్‌శాఖ డైరక్టర్ కె.కన్నబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎ.శోభ, వుడా చైర్మన్ డాక్టర్ టి.బాబురావునాయుడు, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులతో
నిరుద్యోగులకు ఉపాధి
నరసన్నపేట, నవంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లగా లోటుబడ్జెట్‌తో ఉన్నప్పటికీ అభివృద్ధికి పాటుపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం మండలంలోని మడపాం గ్రామంలో రూ.30లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వంశధార రెండో దశ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తిచేయగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రెండవదిగా భావనపాడు హార్బర్ పనులకు కూడా టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని, మూడో ప్రాజెక్టుగా కొవ్వాడ అణువిద్యుత్ కేంద్ర, నాలుగో ప్రాజెక్టుగా పోలాకి మండలంలో ధర్మల్ పవర్ ప్రాజక్టు కూడా పూర్తయితే నిరుద్యోగ సమస్య పూర్తిగా సమసిపోతుందని అన్నారు. వంశధార రెండో దశ పనులు పూర్తయినట్లయితే ప్రతీ ఎకరాకు రెండో పంటకు సాగునీరు అందించే దిశగా కృషి చేయనున్నట్టు తెలిపారు. మహిళా సంఘాలకు పసుపు-కుంకుమ పథకం పేరుతో రుణాలు మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. ఇప్పటికే ప్రతీ మహిళా సంఘాలకు రూ.3వేలు మొదటి విడతగా, రెండో విడతలో రూ.3వేలు జమ చేయడమే కాకుండా ఆ పైకాన్ని సంఘ సభ్యులు వినియోగించుకునే విధంగా ప్రభుత్వం తీర్మానం చేశామని తెలిపారు. చంద్రన్న బీమా పథకంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా ప్రతీ ఒక్క కుటుంబానికి రూ. 3 లక్షల వరకు వైద్య సహాయం అందిస్తామని, ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేసుకున్న వారికి కూడా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అదనపు తరగతులు ప్రారంభించిన అనంతరం చంద్రన్న బీమా పథకంలో భాగంగా రెండు కుటుంబాలకు రూ.5వేలు చొప్పున మొదటి విడతగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జెడ్‌పిటిసి సిహెచ్ శకుంతల, ఎంపిపి శిమ్మపార్వతమ్మ, సర్పంచ్ సిహెచ్ రాజన్న, ఎంపిటిసి జి.సుందరరావు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.