శ్రీవిరించీయం

పాత వ్యవస్థలు - కొత్త ఆలోచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తి పురుషుల మధ్య శృంగార భావము తప్పకయుండును. అది జంతువులనన్నింటియందు ఉన్నది. అసలీ శృంగార భావము లేకున్న సృష్టి జరగదు. ఇది ఈ సృష్టికి అవసరమయిన ప్రక్రియ... ఆస్తి వ్యవహారము వచ్చినది. సమిష్టి ఆస్తి కాక వ్యక్తుల ఆస్తి వచ్చెను. మాతృస్వామ్య వ్యవస్థతో మొదలయి నెమ్మదిగా పితృస్వామ్య వ్యవస్థ వచ్చెను.. ఆ కుటుంబ వ్యవస్థ పటిష్టపరచుటకే స్ర్తికి శీలమను ఆభరణము తొడగబడెను.. శీలమనునది ఈ వ్యవస్థ కొరకేకాని, స్ర్తి కొరకు కాదు. వ్యవస్థకొరకే దానినొక పవిత్రమైన దానని చేసి, అది పోగొట్టుకున్న ఒక స్ర్తిని అధోగతి పాలు చేయుచున్నారు. ఇంకేమి నీతి యున్నది?... అవసరమును బట్టి ఆచారములు మారును. మన ప్రస్తుత సమాజమునందు ఈ వ్యవస్థ వన్నది. ఇందులో స్ర్తి పురుష స్వేచ్ఛా విహారము నిషిద్ధము. ఒక స్ర్తిని వేరొక పురుషుడు బల్కారముగా అనుభవించినంత మాత్రమున ఆ స్ర్తి పోగొట్టుకున్నదేమియు లేదు’- ఈ భావ పరంపరలు ‘అనామకుడు’ (డా ఎ.ఎస్.రామశాస్ర్తీ) రాసిన కథానిక ‘శీలమా? అది ఏమి?’ అన్నదానిలో తారసపడతాయి.
బలాత్కరము, ‘రేప్’ అనేవి ప్రస్తుత సామాజిక వ్యవస్థలో సర్వసామాన్యం అన విషయం. మనం రోజూ పత్రికలలో వస్తున్న వార్తల ధోరణి చూస్తే విదితం అవుతోంది. వెనకటి రోజులలో బలాత్కారం చేయబడ్డ బాలికను, ఆ చేసినవాడిని ఎట్లా అయినా అంటగట్టి వివాహం చేయాలనే ధోరణి వుండేది. తరువాత తరువాత సమాధానపరచి, ధన వితరణ ద్వరా పరిష్కారం, యిటువంటివి అలవాటు అయిపోయాయి. వివాహేతర సంబంధం నిబద్ధం కాదనీ, బలాత్కారం చేసిన వాడికి జైలుశిక్ష- ఆమరణ కారాగారవాసం, ఉరిశిక్ష లాంటివి విధించాలని కూడా ఇపుడు కొందరు విజ్ఞులు భావిస్తున్నారు. జనంలో చైతన్యం పెరుగుతున్న కొద్దీ ‘యిదేదో కొత్తగా ఆలోచించవలసిన స్థితి కాదు. దారిన పోతున్నపుడు ఓ పిచ్చికుక్క కరుస్తుంది. దాన్ని చంపుతాము. కాని మన శరీర భాగం విసర్జించం కదా! అదేదో జరగరాని సంఘటన జరిగిందని దానిని మరచిపో - మనుగడ సాగించడమే ఉత్తమం’ అన్న ఆలోచనలను ప్రతిపాదిస్తూ కొన్ని కథలు తెలుగులో కూడా వచ్చాయి. సంఘ సంస్కరణ విభాగంలో యిటువంటి కథ కొత్త ఆలోచనలుగా తీసుకుని అనుసరించవలసిన వస్తువులు అవుతున్నాయి.
ప్రస్తుతం పరిశీలనలో వున్న ‘కథానిక’కు వస్తే ఇందులో రంగనాధము అనే అతని చెల్లెలు విశాలాక్షి. రంగనాథానికి స్నేహితుడు విశ్వనాథము. ఇతడు విశాలాక్షి పట్ల మక్కువ పెంచుకుని ఆమెతో వివాహ ప్రస్తావన కూడా తెస్తాడు. అయితే ఆమె సమాధానం ఇవ్వదు. వారిద్దరి వివాహం అందరికి అయోధ్య యోగ్యం అయినదే అయిన సందర్భంలో ఒక అనాఘాతం జరిగింది. విశాలాక్షి వివరాలు ఎరగని మనిషి వర్షంలో తన కారులో తీసుకుపోయి ‘బలాత్కరించి ఆమెను చెరచాడు. ఆమెనింటిదగ్గర దింపి, పోలీసులకు ఈ విషయము చెప్పిన నీకే నష్టమని చెప్పిపోయెను’. ఈ దుర్గటనతో విశాలాక్షి తన ‘శీలం’ పోయిందని ఖేదం పొంది, ఆత్మహత్యా ప్రయత్నం చేసి రుూ ప్రయత్నం సానుకూలం కాక దిగులుపడి వుంటుంది. అపుడు విశ్వనాథము ఆమెను ఊరడిస్తూ చెప్పినవే పైన ప్రస్తావించిన మాటలు. అతను యింకా ఇలా అంటాడు. ‘నిన్నకీ, నేటికీ ఏమియు జరగలేదు. నీవు బస్సునుండి పడిన నీకు గాయమగును. నీ బ్రతుకునకర్థము పోవునా? వాన వివరములనిమ్ము. నేను పోలీసులకు చెప్పెదను’.
‘ఈ విషయం నలుగురికీ తెలిసినా ఎవ్వడూ నన్ను వివాహమాడరని వదిన భయము’ అంటుంది విశాలాక్షి.
విశ్వనాథము ‘నేనెన్నియోసార్లు నిన్నడిగితిని- నన్ను వివాహమాడెదవా అని. మరలా అదే ప్రశ్న అడుగుచున్నాను. నీవు ఆడెదననువరకు నేనడుగుచుందును..’ అన్నాడు.
‘విశాలాక్షి, అతని చేతులను తన చేతులలోనికి తీసుకుని కళ్లకద్దుకొనెను’- అన్న వాక్యంతో కథ సుఖాంతం అవుతుంది.
ఒక మనిషి తన జీవితాన్ని సుఖవంతం చేసుకోవడమో లేక దుఃఖమయం చసుకోవడమో.. ఆ మనిషి యొక్క ఆలోచనా ధోరణిమీద ఆధారపడి వుంటుంది తప్ప, పరిస్థితులు - ప్రకృతి యిందుకు ఆలంబనం కాదు, కానక్కరలేదు- అని రుూ కథానిక సూచనగా తెలుపుతోంది. మనిషి తనకు తానే శిక్షకుడు, రక్షకుడుకూడా.
ఈ కథానికలో కొత్త రకం ఆలోచనా విధానంతోపాటు మరో చమత్కారం కూడా వుంది.
‘కథలూ నవలలూ రాయడానికి ఒక చక్కని వాడుక భాష వంటి గ్రాంథమిక భాషను తీర్చిదిద్దుకున్నాడు. విశ్వనాథ సత్యనారాయణగారు ఈ కథ కోసం ఆ శైలిని వాడుకుందుకు ప్రయత్నించాడు- అని కథ చివర ఒక చిన్న నోట్ ఇచ్చారు ‘అనామకుడు’. ఈ నోట్‌ను ముందే చూడకుండా, కథ చదవడం మొదలుపెట్టిన పాఠకుడు- మొదటి నాలుగు లైన్లు చదవగానే, ఇది ‘విశ్వనాథ’వారి వచన గదా! అనుకుంటాడు (తెలుగు కథకులు శైలితో పరిచయం ఉన్నవాడు) ఈ విధంగా కూడా అనామకుడు కథారచన ప్రక్రియలో కృతార్థుడు అయినాడు.

-శ్రీవిరించి