శ్రీవిరించీయం

అంధుడు- అందాల వర్ణనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కడుపు నింపుకోవటానికి చిలువలు పలువలుగా సినిమాను వర్ణించి చాటింపు వేశాడు వాడు. ఒళ్లు గుల్లచేసుకుని కడుపుమాడ్చుకుని (సినిమా చూడటానికి తాపత్రయపడ్డాడు తాను). ఇదే రాములు తన రోజంతా గడిపిన కాలక్షయాన్ని గమనించి తెలుసుకున్న సత్యం.
వాడు అంధుడు. కళ్లకు కట్టినట్లు మాటలతో చిత్రించడం అన్నది ఎంత విడ్డూరమయిన విషయం! తను కళ్లతో చూచిన చిత్రంలోని అందాలన్నీ వాడికి ఎలా కరతలామలకం అయ్యాయి- యిదే రాముడు అస్తవ్యస్తంగా వున్న స్థితిగతులను అర్థంచేసుకోలేక యాతన పడుతున్న సందర్భం.
కలువకొలను సదానంద వ్రాసిన కథానిక ‘రంగు రంగుల దీపం’లో సందర్భపడే పాత్రలు- సన్నివేశాలు యివి. రాములు ఆ బస్తీకి వెళ్లాడు. ‘బస్టాండు ముందర కొళాయి దగ్గర నిలబడి ఇటుకరాతి పొడితో పళ్లు తోముకుంటూ, రాత్రికి రాత్రి గోడమీద వెలిసిన సినిమా పోస్టర్‌కేసి ‘చూస్తూ సినిమా కూడా చూడాలనే ఆశ బిగించుకున్నాడు. దానికితోడు ఆ సినిమాను వర్ణిస్తూ, రుూ అవకాశం మళ్లీ జన్మలోరాదు అన్నట్లుగా రంగురంగుల వర్ణనలు, సన్నివేశ సమీక్షలు చేస్తున్న సినిమా బండిలోంచి వస్తున్న మాటల పల్లవులు. బస్సుదిగిన వాళ్ల ‘లగేజి’ యింటికి చేర్చి వాళ్లు యిచ్చే తృణమో ఫణమో తీసుకుని రోజులు గడిపే వృత్తి అతనిది. కూలీ దొరకక పోవడంతో రోడ్డుమీద వచ్చేపోయే వాళ్లను చూడడం, వాళ్లు నడుపుతున్న సంభాషణలు విని- అందుకు తగినట్లుగా తన మనసులో ఊహలు పెంచుకోవడం అతనికి కర్తవ్యం అయింది. ఒక్క అర్ధ రూపాయి దొరికితేచాలు, సినిమా చూడటానికి అవకాశం వస్తుంది. దీనికోసం వెంపర్లాడుతూ తిరుగుతున్నాడు. కడుపుకోసం అనేక యాచనలు, యెద్దేవాలుచేస్తూ కాలం గడుపుతున్న వాళ్లు కనిపిస్తున్నారు.
‘యుద్ధ్భూమిలో కూరుకుపోయిన కర్ణుడి రథంలా, సినిమాబండి సంత గేటు దగ్గర ఆగిపోయి, అక్కణ్నుంచి మళ్లీ కదలలేదు. పాటల హోరులో సంతగోల అణిగిపోయింది. సంతకు వచ్చిన ఇంతులందరూ బండివైపుచూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. చారల చొక్కావాడు గొంతు మార్చిమార్చి పల్లెటూరి బావామరదళ్ల డైలాగులు చెబుతున్నాడు. - ఈ గందరగోళం యిలా నడుస్తూ వుండగా చారల చొక్కావాడికి (సినిమా బండి నడుపుతూ కథ చెబుతున్నారా?) ఒక గుమాస్తావద్ద ఆరోజు కూలీ మూడురూపాయలు చేతిలో పెడతాడు.
సన్నివేశాలన్నీ చూస్తూ వున్న రాములుకు కడుపులో కాలుతూ వుంది. ఏమన్నా తినాలి. తినాలంటే డబ్బులు కావాలి. అవే ఆకాశంలో నక్షత్రాలలా తయారయ్యాయి. సినిమా టిక్కెట్టు కొనగా మిగిలిన చిల్లర డబ్బులతో తరువాత కడుపులో ఆకలిని ఎలా జయించవచ్చో ఆలోచించుకుంటూనే సినిమా చూస్తూ వున్నాడు. ఇంటర్వెల్ తరువాత సినిమాలో స్థానాలు మారిపోయి, రాములుకు బస్టాండ్‌లో పత్రికలు అమ్మే బాలయ్య పక్కన కూర్చోవడం తటస్థిస్తుంది. ఈ బాలయ్యే అతనికి ‘బండిలో కూర్చుని సినిమా కబుర్లు’చెప్పే మనిషిని గురించి వివరాలు తెలిసివస్తాయి. ఆ చారల చొక్కావాడి పేరు సుదర్శనం. కళ్లు వున్నప్పుడు అతను నాటకాలు వేసేవాడు. పాటలు కూడా బాగా పాడతాడు... ఇప్పుడు టైఫాయిడ్ వచ్చి చూపుపోయింది. ఇప్పుడు యే పనీ చేయలేడు. బండిలో తిరిగి వచ్చిన రోజున సినిమావాళ్లు రెండోమూడో యిస్తారు. అదే అతని సంపాదన!!
ఈ సంగతి తెలుసుకున్న దగ్గర్నుంచి రాములుకు తన జీవితాన్ని, సినిమా బండితోలే సుదర్శనం జీవితాన్ని సరిపోల్చుకు చూచుకోవడంతో మనసంతా నిండిపోయింది. తనుకూడా గుడ్డివాడు అయిపోయినట్లు కళ్లు మూసుకుని లోపలికి వెళ్లాడు. ‘ఏముంది చూడటానికి? ప్రపంచం - మిధ్య! జీవితం-మిధ్య! ఉన్నది అనుకుంటున్నది. యేమీలేదు. తానూ- చీకటి! ఇంతకు తప్ప సృష్టిలో మరేదీ లేదు!...’అన్న ఆలోచనలు అతని అల్ప మెదడులో మెదులుతాయి. అలసిపోయినప్పుడు వచ్చే వేదాంత ధోరణి దానిని లొంగదీసుకుంటుంది. ‘నాకావర్ణ శోభిత ప్రకృతి సౌందర్యంలో ఒక్కో భాగమే చీకట్లోనుంచి వచ్చి స్లైడులాగ క్షణకాలం నిలిచి మళ్లీ చీకట్లోకి నిష్క్రమిస్తున్నది!- అని తాత్త్విక తత్వాన్ని లోచూపులోనే సుకుమారంగా అందుకోగలుగుతాడు.
బతుకులు (సృష్టి అయినప్పుడు) ఎనె్నన్నో రంగులు తీర్చిదిద్దుతూ కనిపిస్తాయి. కాని తీరా అంధత్వం సంప్రాప్తం అయినప్పుడు ‘రంగురంగుల చీకటి’ తప్ప యింకేమీ వుండదు- అనే పరమార్థాన్ని అందుకుని ఆస్వాదించుకోగలుగుతాడు.
మామూలు మనుషుల జీవితం (రోజువారీ కూలి భత్యంమీద బతుకు వెళ్లమార్చేవాళ్ల జీవితం) ఎలా ఊహాలోకంలో పరిభ్రమించి, అసలు సత్యాన్ని- జీవిత యదార్థాన్ని అలవోకగా తెలుసుకోగలుగుతుందో ఈ కథానిక చదువరికి ఎఱుక చేస్తుంది. ఈ ఎఱుక తాత్కాలికం అయినదే కావచ్చును- కాని జీవితంలో మటుకు శాశ్వతమైనది!

-‘శ్రీవిరించి’