శ్రీవిరించీయం

నరరూప రాక్షసుడు - లక్ష్యం లేని నేరగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అంజనమ్మ కూతురు పార్వతి. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకుకు జన్మనిచ్చిన పార్వతి అర్థాంతరంగా పాము కాటుతో తనువు చాలించింది. కూతురు చావుకు వచ్చిన అంజనమ్మ పిల్లల్ని చూసుకోవడం కోసం వుండిపోవలసి వచ్చింది. అంతవరకు హంసాపురంలో చిన్నకొడుకు దగ్గర వుండేది’- ఆచార్య ఎం.కె.దేవకి రాసిన ‘జంతువు’ అనే కథానికకు భూమిక యిది.
ఇటువంటి అంజనమ్మకు మరో మనోవ్యధ ఎదురయింది. మనవరాలు ఉమ కడుపులో తిప్పినట్లుగా వుంటోందని కొన్ని రోజులుగా అన్నం తినడం మానేసింది. ఎంతో బలవంతంమీద యింత అన్నరసం అందించినా ఉమ భళ్లున కొక్కోవటం తప్ప యింకేం చేయలేకపోతోంది. అంజనమ్మకు పక్క యింటి విశాలాక్షి- ఈమె పార్వతికి స్నేహితురాలు- సలహా తీసుకోవడం శ్రేయస్కరం అనిపించింది.
ఒక పక్క అల్లుడు యింటికి సరిగా రాడు. పిల్లకు ఏమయిందో విచారించడు. ఏ అర్థరాత్రో రావడం, ఉదయమే వెళ్లిపోవటం- యిదే అతని కర్తవ్యం. పైగా అతను ఊరిపెద్ద, రాజకీయ నాయకుడు. అంజనమ్మకు మనవరాలు గర్భిణీ అయిందేమోనని అనుమానం. ‘నోరు వాయి లేని పిల్ల. ఏ మగవాడితోనూ మాట్లాడగా చూడలేదు. తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటి పనులు చేసే దిక్కు లేక బడి మానేసింది.
మనవరాలు ఉమ ఆ ఊళ్లో వున్న అయిదవ తరగతి వరకు చదువుకుంది. మేనత్త కొడుకు రామ్మోహన్‌కు ఉమను యిచ్చి పెళ్లిచేయాలని చిన్నప్పటినుంచి అనుకున్నారు. రామ్మోహన్ పొలం పనులు చేసుకుంటూ తండ్రికి ఆసరాగా వున్నాడు. ఉమ పరిస్థితి అంజనమ్మకు మరింత ఆందోళనకరంగా తయారయి విషయం ఏమిటో తెలుసుకోవడం అత్యవసరం అయింది.
మధ్యాహ్నం భోజనం అయిన తరువాత ఉమ తండ్రి మిద్దెపైన ఉన్న గదిలో విశ్రాంతి తీసుకుండు. మళ్లీ అయిదు గంటలకు లేచి మొహం కడుక్కుని పొలానికి వెళ్తాడు. ఆ టైంలో పిల్లలు స్కూల్లో వుంటారు. అంజనమ్మ అలిసిపోయి వసారాలో నడుం వాలుస్తుంది. మోకాళ్ల నొప్పితో ఆమె ఏనాడూ మిద్దె మెట్లెక్కలేదు.
ఒక రోజు మంచినీళ్లు తెమ్మని ఉమను కేకేశాడు తండ్రి పాపారావు. మంచినీళ్ల చెంబు తీసుకుని గదిలోకి వెళ్లి తిరిగి వస్తున్న ఉమను పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్న పాపారావు అమాంతం ఉమను కౌగిలిలో బంధించాడు. అరిచావంటే పీక నులిమి చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే నిన్ను కాదు, నీ తమ్ముణ్ణీ, చెల్లెల్నీ చంపేస్తాను. రోజూ మధ్యాహ్నం నేను మిద్దెమీదికి రాగానే నువ్వూ కాఫీ గ్లాసుతో వచ్చేయాలి. లేకుంటే అందరి ప్రాణాలు తీసేస్తాను, అర్థమయిందా?’ అని బెదిరించి హెచ్చరించాడు. లోకజ్ఞానం లేని ఉమ నోరు నొక్కకుండా ఉండిపోయింది.
‘ఒరే పాపారావూ, నువ్వు నిజంగా పాపాత్ముడివే. వయసులో వున్న కన్నబిడ్డను నాశనం చేసిన కసాయివాడివి. నీకు వేయటానికి లోకంలో ఇప్పుడున్న శిక్షలేవీ సరిపోవు?’ అని ఆక్రోశించింది విశాలాక్షి. అంజనమ్మ ఈ విషయం తెలుసుకోగానే మూర్ఛపోయింది. కొంతసేపయినాక తెలివి తెచ్చుకుని సంబాళించుకుంది.
పాపారావు చేసిన నేరానికి శిక్ష లేదు. అసలు నేరం అనేదే బహిరంగం కాలేదు. ఊళ్లో వాళ్ళు శాపనార్థాలు పెట్టడం తప్ప యింకేం చేయలేదు. పైగా రచ్చబండ రాజకీయాలు చేస్తూనే వున్నాడు. ఎం.ఎల్.ఏ అవుతాడని కూడా ప్రచారం.
ఇప్పటికీ మారుమూల గ్రామాల్లోనే కాక పట్టణాలలో కూడా జరుగుతున్న అత్యాచారాలకు రుూ కథానిక దర్పణం. ‘రేప్’ చేసినవాడికి మరణశిక్ష అనే శాసనం కూడా వుండవచ్చును, కానీ బయటపడనివాడికి భయం లేదు గదా! దొరికితేనే దొంగలు! ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదు చేసేది! అంతవరకూ గప్‌చిప్!

-శ్రీవిరించి