శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రేపు డిసిసి అధ్యక్షుడిగా పనబాక బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, డిసెంబర్ 26: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాను ఈనెల 28వ తేదీన బాధ్యతలు చేపడుతున్నట్లు పనబాక కృష్ణయ్య తెలిపారు. శనివారం ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 131 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇందిరాభవన్‌లో కేక్ కట్ చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లో మట్టి సత్యాగ్రహాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగా మట్టిని సేకరించి ప్రధానమంత్రికి పోస్టు ద్వారా పంపనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. ముందుగా రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి ఇందిరాగాంధీ, నెహ్రు, అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తామని చెప్పారు. అనంతరం ఇందిరాభవన్‌లో బహిరంగ సభను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉడతా వెంకట్రావు, పిసిసి కోఆర్డినేటర్ సివి శేషారెడ్డి, పిసిసి ఉపాధ్యక్షుడు దేవకుమార్‌రెడ్డి, పిసిసి జనరల్ సెక్రటరీ చెంచలబాబు యాదవ్, పిసిసి స్పోక్స్‌పర్సన్ కనకట్ల రఘురామ్ ముదిరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలసుధాకర్ తదితరులు పాల్గొన్నారు.