శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వరద బాధితుల చెక్కులు పంపిణీ రసాభాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, డిసెంబర్ 26: స్థానిక పంచాయతీ కార్యాలయంలో వరద బాధితులకు చెక్కుల పంపిణీ శనివారం సాయంత్రం కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెలలో వచ్చిన వరదలకు స్థానిక దళితవాడ మొత్తం మునిగిపోయింది. దాదాపు 90 శాతం మందికిపైగా ఇళ్లలోకి వరద నీరు చేరి సుమారు 250 కుటుంబాలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయామన్నారు. వీరితోపాటు సుమారు 10 ఇళ్లు పైగా నేలకూలాయి. సర్వే అధికారులు కేవలం 50కుటుంబాలు మాత్రమే నీట మునిగాయని, 5ఇండ్లు మాత్రమే కూలిపోయాయని జాబితాను వెల్లడించారు. దీంతో దళితులు తహశీల్దారు కార్యాలయాన్ని చుట్టిముట్టి అర్హులైన బాధితులందరికీ పరిహారం చెల్లించాలంటూ నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహశీల్దారు కెవి రమణయ్యను నిలదీశారు. దీంతో రీ-సర్వే చేపట్టి అందరికీ పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత కొద్ది రోజుల క్రితం పంచాయతీ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా బాధితులందరికీ పరిహారం ఇచ్చే వరకు చెక్కుల పంపిణీ వాయిదా వేయాలంటూ దళితులు అడ్డుకుని మళ్లీ తహశీల్దార్‌ను నిలదీశారు. దీంతో చెక్కుల పంపిణీని నిలుపుదల చేస్తున్నామని, రీ-సర్వే ఇచ్చిన తర్వాత మాత్రమే చెక్కులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. గత మూడు రోజులుగా చెక్కుల పంపిణీ చేస్తున్న దళితవాడకు చెందిన కుటుంబాలు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరించి చెక్కులను తీసుకోవడానికి ముందుకు రాలేదు. శనివారం సాయంత్రం దళితవాడకు చెందిన కొందరు చెక్కులు తీసుకోవడంతో దళితవాడకు చెందిన మహిళలు భారీ సంఖ్యలో చేరుకుని చెక్కుల పంపిణీని అడ్డుకున్నారు. దీంతో కార్యక్రమం రసాభాసాగా మారింది. ఈ సందర్భంగా విఆర్‌ఓ ఉపేంద్ర మాట్లాడుతూ దళితవాడకు చెందిన వారికి చెక్కులు ఇవ్వడం లేదని చెప్పడంతో మహిళలు వెనుతిరిగారు.
గొలగమూడిలో భక్తుల సందడి
వెంకటాచలం, డిసెంబర్ 27 : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆశ్రమంలో నిత్యం అన్నధాన కార్యక్రమం నిర్వహిస్తారు. శనివారం ఒక్కరోజే 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నధాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆశ్రమంలో స్వామి వారిని ప్రత్యేక పూలంకరణతో అలంకరించారు. అలయ ఆర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిర్భయ కింద నిందితుడి అరెస్ట్
ఆత్మకూరు, డిసెంబర్ 26: ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం గ్రామంలో వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వేధించిన ఘటనపై నిర్భయ చట్టాన్ని నమోదుచేసి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు ఎస్సై అబ్దుల్ రజాక్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పారావుపాళెం గ్రామానికి చెందిన కండె శ్రీనివాసులు అనే నిందితుడ్ని అరెస్ట్ చేశామన్నారు. విలేఖర్ల సమావేశంలో ఆయనతోపాటు ఏఎస్సై సాయిబాబా కూడా ఉన్నారు.