శ్రీకాకుళం

ప్రజా సమస్యల పరిష్కారానికే జన్మభూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, జనవరి 2: మారుమూల ప్రాంతాల్లో నేటికి పరిష్కారం కాని సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల ప్రత్యేకాధికారి కె.అప్పలస్వామి అన్నారు. మండలం అల్లాడ గ్రామంలో శనివారం జరిగిన జన్మభూమి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్న వివిధ సంక్షేమపథకాలు సరఫరా విషయంపై లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన పింఛన్‌లు, నిత్యవసర సరుకుల పంపిణీ విధానం, అంగన్వాడీ, పాఠశాలల పనితీరు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజల ద్వారా సమాచారాన్ని రాబట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి బృందం అధికారి, తహశీల్దార్ ప్రవల్లిక ప్రియ మాట్లాడుతూ మండలానికి 958 రేషన్‌కార్డులు మంజూరు అయ్యాయని వీటిని వీలైనంత తొందరలో జన్మభూమి కమిటీ సమావేశాల్లో లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. స్థానిక సర్పంచ్ సనపల ఆండాలు రమణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఎంపిటీసీ సభ్యురాలు అంకమ్మ, జన్మభూమి కమిటి కన్వీనర్ బగ్గు గోవిందరావు, మార్కెట్ కమిటి డైరెక్టర్ హనుమంతు రంగనాధం, పర్లాం డిస్ట్రిబ్యూటరీ కమిటి అధ్యక్షులు కింజరాపు సత్యన్నారాయణ, రెవెన్యూ పరిశీలకులు ఎస్.రామారావు పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
తిమడాం, సురవరంలో
మండలం మొదటిరోజు జన్మభూమి కార్యక్రమం ఎంపిడివో వాసుదేవరావు నేతృత్వంలో శనివారం తిమడాం, సురవరం పంచాయతీ కేంద్రాలలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. తిమడాం సర్పంచ్ వెలమల భారతీ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ఎంపిటీసీ వెలమల ప్రభావతి, ఎఎంసి చైర్మన్ వెలమల చంద్రభూషణ, పలువురు పాల్గొన్నారు. సురవరం పంచామతీ సర్పంచ్ వాన సింహాచలం(రాజు) అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

అభివృద్ధి చేయడమే చంద్రబాబు లక్ష్యం
పోలాకి, జనవరి 2: విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే సి.ఎం చంద్రబాబు ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం మూడో విడత జన్మభూమి మావూరు కార్యక్రమాన్ని మబగాంలో లాంఛనంగా ప్రారంభించారు. మబగాం గ్రామాన్ని స్మార్ట్‌విలేజ్‌గా దత్తత తీసుకున్నట్టు తెలిపారు. గ్రామాన్ని అన్ని వౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాటికి గ్రామస్థులు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, కాలువల పరిశుభ్రత, మంచినీటి సౌకర్యం, మాతాశిశు మరణాలు, విద్యుత్ సరఫరా పోషకాహారం లోపం లేకండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జన్మభూమి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా మరుగుదొడ్లు నిర్మించి ఆరుబయట మలమూత్రవిసర్జన చేయకుండా ఉండాలని, వ్యాధుల బారిన పడకుండా గ్రామస్థులు చైతన్యం కలగాలని కోరారు. అనంతరం వణిత మండలం, తలసముద్రం, గొళ్లలవలస గ్రామాలలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. అనంతరం మబగాం సర్పంచ్ ప్రతినిధి ధర్మాన లక్ష్మందాసు మాట్లాడుతూ గ్రామంలో 500 వ్యవసాయ బోర్లు ఉన్నాయని ఆ లైన్‌లు విద్యుత్ తీగలు పాడైపోయాయని వాటిని పునరుద్ధరించాలని, డంపింగ్ యార్డు కోసం స్థలం సమకూర్చాలని విద్యుత్ లేనప్పుడు మంచినీటి సరఫరాకు ఎటువంటి ఆటంకంలేకుండా జనరేటర్ అవసరమని ఈ సదుపాయాలన్ని కల్పించాలని ఆయన కోరారు. అనంతరం గంగివలస కస్తూరిబా గురుకుల పాఠశాల బాలికలచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి అధ్యక్షుడు భైరి భాస్కరరావు, సాగునీటి ఉపాధ్యక్షుడు ఎం.వెంకటప్పలనాయుడు, మండల ప్రత్యేక సలహాదారు తమ్మినేని భూషణరావు, జన్మభూమి ప్రత్యేకాధికారి వి.జయరాజ్, ఎంపిడివో బి.లక్ష్మీపతి, తహశీల్దార్ జెన్ని రామారావు, ఆర్ ఐలు అనిల్‌కుమార్, బాలకృష్ణ, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.