కృష్ణ

వైభవంగా విజయరాజరాజేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: శ్రీ విజయరాజరాజేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలోని శ్రీ విజయ రాజరాజేశ్వరీ శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో పీఠాధిపతులు వాసుదేవానందగిరి స్వామిజీ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తజన నామస్మరణల మధ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని వేదపండితులు వేదోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి పలు వైధిక కార్యక్రమాలను అర్ఛకస్వాములు నిర్వహించారు. ఉదయం 7.54 నిమిషాలకు యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, రాజగోపురం విమానగోపురాల కలశ ప్రతిష్ఠ కార్యక్రమాలను వేదపండితులు నిర్వహించారు.
హాజరైన పలువురు ప్రముఖులు
పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, పారిశ్రామికవేత్త తొండెపు హనుమంతరావు దంపతులు ఆయా ధ్వజస్తంభ, రాజగోపుర కలశాల ప్రతిష్ఠలో పాలుపంచుకున్నారు. అదే విధంగా వాసవి సంస్థల ప్రముఖులు జిడివి ప్రసాదరావు, పారిశ్రామికవేత్త తటవర్తి సూర్యనారాయణ గ్రామ పెద్దలు తదితరులు ఇతర ప్రతిష్ఠలో భాగస్వాములయ్యారు.
వైభవంగా శాంతి కల్యాణం
మహాకుంభాభిషేకం సందర్భంగా మధ్యాహ్నం శాంతి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలోని వివిధ ఘట్టాలను వివరిస్తూ అర్ఛకస్వాములు ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవాన్ని నిర్వహింపజేశారు. కల్యాణం తరువాత రుత్వికుల సన్మానం, ఆశ్వీర్చన కార్యక్రమాలను నిర్వహించారు.
పాల్గొన్న పీఠాధిపతులు, స్వామీజీలు
శ్రీ బ్రహ్మచారి శివస్వామి (శ్రీకోటిలింగ మహాశైవ క్షేత్ర పీఠాధిపతి, తాళ్లాయపాళెం), శ్రీ మాతాశివచైతన్యానందజీ (శ్రీ చైతన్యతపోవనం, తాడేపల్లి), శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీ (శ్రీ వ్యాసాశ్రమ వ్యాసపీఠాధిపతి), శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామీజీ (శ్రీ శుకబ్రహ్మాశ్రమ పీఠాధిపతి, శ్రీకాళహస్తి), 108 శ్రీ దండి నిర్మలానందగిరి స్వామీజీ (అష్టలక్ష్మి పీఠాధిపతి, తెనాలి), శ్రీ ఆచార్య శంకరానందగిరి స్వామీజీ (పరమాత్మానందాశ్రమాధపతి, పెనమలూరు), శ్రీ ఆచార్య స్వస్వరూపానందగిరి స్వామీజీ (శ్రీ శిష్టాశ్రమాధిపతి, శ్రీనివాసమంగాపురం), శ్రీ ఆచార్య శ్రీ హరితీర్థస్వామి (శ్రీ సత్యానందాశ్రమాధిపతి, ఇనమడుగు), శ్రీ ఆచార్య శంకరానందగిరి స్వామీజీ ( శ్రీ దత్తాత్రేయాశ్రాధిపతి, తుక్కుగూడ), శ్రీ మాతా జ్యోతిర్మయానందభారతి ( షణ్ముఖ పరబ్రహ్మశ్రమాధిపతి, పాలకొల్లు), శ్రీ చంద్రకాళీ వరప్రసాదమాతాజీ (కాళీవనాశ్రమాధిపతి, నంబూరు), శ్రీ మాతా పరావిద్యానందగిరి (శ్రీ యాజ్ఞవల్కాశ్రమాధిపతి, యాచారం), శ్రీ మాతా నిర్విశేషానందగిరి ( శ్రీ సద్గురు సేవాశ్రాధిపతి, వంగలపూడి) తదితర పీఠాధిపతులు, స్వామీజీలు పార్గొన్నారు.

ప్లాటినం ‘త్రీజీ’ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన ఎయిర్‌టెల్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 25: భారతదేశపు నెంబర్-1 ఆపరేటర్ ఆసియా ఆఫ్రికా వంటి 20 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచంలో మూడవ అతి పెద్ద మొబైల్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా నిలచిన ఎయిర్‌టెల్ తన ప్లాటినం ‘త్రీజీ’ నెట్‌వర్క్‌ను నగర వినియోగదారుల కోసం గురువారం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల భారతీ ఎయిర్‌టెల్ సిఇవో వెంకటేష్ విజయరాఘవన్ మాట్లాడుతూ దీని ద్వారా ఇండోర్ కవరేజిని మరింత వృద్ధి చేయడంతోపాటుగా వాయిస్ స్పష్టత మెరుగుపడగలదన్నారు. అత్యుత్తమ వేగంతో ఇంటర్నెట్‌ను అందించడం సుపీరియర్ నెట్‌వర్క్ అనుభవాలను వినియోగదారులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. అదనంగా నెట్‌వర్క్ మొబైల్ పరికరాల నడుమ బ్యాకెండ్ ఎంగేజ్‌మెంట్ ఆప్టిమైజ్ కావటంలో సహాయపడుతుందన్నారు. దీనివల్ల వినియోగదారులు తమ ఫోన్ల బ్యాటరీ జీవితకాలాన్ని మరికొంత సమయం పొడిగించుకోవచ్చన్నారు. ప్లాటినం త్రీజీ డ్యూయల్ బ్యాండ్ స్పెక్ట్రమ్ 900 మెగా హెర్జ్ మరియు 2100 మెగా హెర్జ్‌లతో శక్తివంతమైనదన్నారు. ఈ సేవలకు ఎలాంటి అదనపు సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఎపి సర్కిల్‌లో 1900 త్రీజీ పట్టణాలు మరియు 8 నగరాల్లో ఫోర్‌జీ సేవలను అందిస్తున్నది.

కాంట్రాక్టు లెక్చరర్లను
క్రమబద్దీకరించాలి
లబ్బీపేట, ఫిబ్రవరి 25: కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు అవరోధంగా నిలిచిన 2/94 చట్టానికి సవరణ తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు కె పార్థసారథి పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చి, వాటిని మరచిపోయినట్లు నటిస్తున్నాడని ఆయన విమర్శించారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ డిమాండ్‌తో13 జిల్లాలకు చెందిన ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు చలో విజయవాడ కార్యక్రమం గురువారం లెనిన్ సెంటర్‌లో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీల వారిని లోబరుచుకునే ప్రయత్నాలపై పెట్టే శ్రద్ధలో ఒక్క శాతం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై పెడితే సమస్య తీరుతుందన్నారు. పిడిఎప్ శాసన సభ్యుడు విఠపు బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రెగ్యులరైజేషన్ కోసం ఆందోళనబాట చేపట్టిన కాంట్రాక్ట్ లెక్చర్లరను ఉగ్రవాదుల్లాగా భావించి వేదించటం సరికాదని అన్నారు. శాసన సభ్యుడు గాదె శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ పాలకులకు చిత్తశుద్ది ఉంటే కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తే ఈ సమస్య పెద్దది కాదన్నారు. ఆనంతరం కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళనకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ శాసన మండలి సభ్యుడు డాక్టర్ గేయానంద్, ఎస్.టి.యు రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, యు.టి.ఎఫ్ అధ్యక్షుడు బాపిరెడ్డి, ఎ.పి కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, సిఐటియు అధ్యక్షులు పుణ్యవతి, తెలంగాణా కాంట్రాక్ట్ లెక్చరర్ల అధ్యక్షుడు డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, రామకృష్ణ, సిపిఎం నేత వెంకటేశ్వరరావు, ఎపి ఎన్‌జిఒ ఉపాధ్యక్షుడు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 25: జలయజ్ఞంతో ప్రారంభించిన వివిధ ప్రాజెక్ట్‌ల నిర్మాణాల వలన సర్వం కోల్పోయిన బాధితులకు వెంటనే పునరావాసం కల్పించే విషయంలో చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్ట్ నిర్వాహితుల సంఘ అధ్యక్ష,కార్యదర్శులు యం బాబూరావు, యం సీతారామ్ తదితరులు సిఆర్‌డి కమిషనర్ శశిభూషణ్‌కుమార్‌కు సమర్పించిన వినతి పత్రంలోపేర్కొన్నారు.

వెహికల్ డిపో ప్రతిపాదనపై
స్టాండింగ్ కమిటీ అసహనం
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 25: విఎంసిలోని చెత్త రవాణా చేసే వాహనాల రిపేరు వ్యవహారంలో వెహికల్ డిపో అధికారులు అవలంభిస్తున్న తీరుపై స్టాండింగ్ కమిటీ సమావేశంల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముందుగా ఎటువంటి సమాచారం లేకుండా రిపేరు చేయించాం, ఖర్చు నిమిత్తం లక్షలాది రూపాయలను విడుదల చేయండంటూ కమిటీకి నివేదించడం సరికాదని, ఇదే విషయాన్ని గతంలో కూడా తెలిపినా మళ్లీ పాత పద్ధతులనే అనుసరించడం సబబు కాదంటూ స్టాండింగ్ కమిటీ సభ్యులు పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా గురువారం కౌన్సిల్ భవనంలోని స్టాండింగ్ కమిటీ హాల్లో మేయర్, కమిటీ చైర్మన్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యుడు కాకు మల్లికార్జున రావుతోపాటు మిగిలిన సభ్యులు కూడా అధికారుల తీరుపై మండిపడ్డారు. విఎంసికి చెందిన చెత్త రవాణా వాహనాలు 30 ఉండగా కేవలం 15 మాత్రమే వినియోగంలో ఉన్నాయని, దీంతో వాటినే మూడు షిఫ్టుల కింద పనిచేయిస్తున్నందున దీర్ఘకాలంగా మరమ్మతులకు గురై మూలన పడ్డ మూడు వాహనాలను నగరంలోని ఆశక్ లేలాండ్ ఆథరైజ్డ్ డీలర్ ఆటోమోటీవ్ కంపెనీతో రిపేరు చేయించినందున అందు నిమిత్తం వ్యయం అయిన సుమారు 18లక్షల రూపాయలను మంజూరు చేయాలంటూ విఎంసి వెహికల్ డిపో అధికారులు స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదించిన అంశాన్ని సభ్యుల చర్చ అనంతరం ఎట్టకేలకు ఆమోదించారు. ఇకముందు ఏ వాహనానికి ఎంత రిపేరు అవుతుందోనన్న విషయాన్ని ముందుగానే తెలపాలని అధికారులకు సూచించారు.మెప్మా వారి ఆదేశాల ప్రకారం నగరంలో ప్రొడక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నందున ఇందు నిమిత్తం సాయి మహిళా డ్వాక్వా గ్రూపునకు మొగల్‌రాజపురంలోని కమ్యూనిటీహాల్‌ను నెలకు 10,176 రూపాయల అద్దె చొప్పున కేటాయించుటకు కమిటీ ఆమోదం తెలిపింది. విఎంసి పరిధిలోని 17 అర్బన్ హెల్త్ సెంటర్లతోపాటు 4 మున్సిపల్ మెటర్నటీ హోమ్‌లకు అవసరమైన సర్జికల్స్‌తోపాటు జనరిక్ మెడిసిన్ జీవన్ ధారా స్టాండర్స్ మందులను కొనుగోలు చేయుటకు గాను టెండర్ పిలవడానికి స్థారుూ ఆమోదం తెలిపింది. విఎంసి జిమ్, స్విమ్మింగ్ పూల్స్‌లలో కోచ్‌లుగా పనిచేస్తున్న 15 మంది కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగించుటకు కమిటీ ఆమోదం తెలిపింది. సీతన్నపేట లోని కమ్యూనిటీహాల్ లీజు కాలాన్ని మరో 3 సంవత్సరాల పాటు పొడిగిస్తూ అందుకు ప్రస్తుతం చెల్లిస్తున్న 9,94,690 రూపాయలకు సర్వీస్ టాక్స్ 14.05 శాతంతో వసూలుకు ఆమోదం తెలిపింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.

కూచిపూడి యక్షగానాలు సశాస్ర్తియమే..

కూచిపూడి, ఫిబ్రవరి 25: కూచిపూడి నాట్యానికి వనె్న తెచ్చిన యక్షగానాలు సశాస్ర్తియమైనవని ప్రముఖ గాత్ర సంగీత విద్వాంసులు డివిఎస్ శాస్ర్తీ, నాట్యాచార్య డేగల సాంబశివరావు అన్నారు. కూచిపూడి నాట్యారామం, కేంద్ర సంగీత నాటక అకాడమీ (న్యూఢిల్లీ) ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, నర్తనం పర్యవేక్షణలో నాట్యక్షేత్రం కూచిపూడిలో నిర్వహిస్తున్న కూచిపూడి యక్షగాన మహోత్సవాల్లో భాగంగా మూడోరోజైన గురువారం స్థానిక శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో నిర్వహించిన నాట్య సదస్సు, ప్రదర్శనా పూర్వక ప్రసంగాల్లో ఇద్దరు పాల్గొన్నారు. ఈసందర్భంగా డివిఎస్ శాస్ర్తీ మాట్లాడుతూ యక్షగాన పితామహులు చింతా వెంకట్రామయ్య అప్పటివరకు దర్బార్ రాగంలో కొనసాగిన భామాకలాపాన్ని శంకరాభరణం రాగానికి వినియోగించి రక్తికట్టించారన్నారు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్ర్తీ అనాదిగా వస్తున్న దర్బార్ రాగంతోనే భామాకలాపాన్ని ప్రదర్శించారన్నారు. తదుపరి పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం, పద్మశ్రీ డా. వేదాంతం సత్యనారాయణ శర్మ, వేదాంతం వెంకట నాగ చలపతి, తదితర నాటి మేటి నాట్యాచార్యులు కూచిపూడి నాట్యాల్లో పాత్రల్లోని భావాలకు అనుగుణంగా సంగీతాన్ని సమకూర్చి సర్వజన రంజితంగా ప్రదర్శించారన్నారు.
డేగల సాంబశివరావు మాట్లాడుతూ కూచిపూడి యక్షగానాలు కేవలం జానపద నృత్యాలు, పల్లెసుద్దులు వంటి సామాన్య ప్రదర్శనలు కాకుండా చందో రీతులతో లఘువులు, గురువులు, చంపకమాల, ఉత్పకమాల, సీసం, ఆటవెలది పద్యాలతో పాటు శోభనాలు, పల్లలు, అర్ధచంద్రికలు, లక్షణాలైన తెలుగు వ్యాకరణాలను ఉపయోగించి యక్షగాన రాగాలను ఆలపించి జనరంజకంగా మలిచారన్నారు. పురాణం మాధవి, నాట్యారామ కమిటీ ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డా. వేదాంతం రామలింగశాస్ర్తీ వ్యాఖ్యాతగా, పసుమర్తి రత్తయ్యశర్మ, వేదాంతం రాధేశ్యాం, చింతా సీతారామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. సదస్యులను జ్ఞాపికతో సత్కరించారు.