కృష్ణ

నిత్యావసరాల పంపిణీలో అలసత్వం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నిత్యావసర వస్తువుల పంపిణీలో అలసత్వం వహించే డీలర్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ బాబు.ఎ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం నగరంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన చౌకధరల దుకాణం 118 షాపును జిల్లా కలెక్టర్ బాబు.ఎ ఆకస్మికంగా తనిఖీ చేసి నిత్యావసర వస్తువుల పంపిణీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్డుదారులకు ప్రతినెలా 7వ తేదీలోపు నూరుశాతం సరుకులను పంపిణీ చేయవలసి వుండగా ఇప్పటివరకు 118వ దుకాణంలో 1064 కార్డుదారులకు గాను కేవలం 460 మందికి మాత్రమే నిత్యావసర సరుకులను పంపిణీ చేయటం డీలర్ అలసత్వంగా భావిస్తున్నామన్నారు. సరుకులను సకాలంలో పంపిణీ చేయని డీలర్లు కార్డులతో కొన్ని కార్డులను సకాలంలో పంపిణీ చేస్తున్న డీలర్లను బదలాయించటం జరుగుతుందన్నారు. ప్రతినెలా 7వ తేదీలోపు నిత్యావసర వస్తువులను సరఫరా చేయని డీలర్లను తొలగించేందుకు వెనుకాడబోమన్నారు. డీలర్లు లక్ష్యాలను ముందుగానే అధిగమిస్తే వారికి ప్రోత్సాహక కమిషన్‌ను మంజూరు చేస్తామన్నారు. పౌర సరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులు రేషన్ దుకాణాలను నిరంతరం పర్యవేక్షించి నిత్యావసర వస్తువుల సరఫరా సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్యాలను పూర్తిచేయటం డీలర్లకు ఎంత బాధ్యత వుందో పౌర సరఫరాల అధికారులకు అంతే బాధ్యత వర్తిస్తుందని బాధ్యతా రాహిత్యంగా విధులను నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

మినుము కోత యంత్రం బోల్తా: ఒకరి మృతి
గుడివాడ, మార్చి 6: మినుము కోత యంత్రం బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గుడివాడ రూరల్ మండలం లింగవరంలో పొలంలో ఆదివారం మినుము కోత నిమిత్తం యంత్రాన్ని గట్టుపైకి ఎక్కిస్తుండగా అది అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో జుట్రు అంతర్వేది కుమారి (40) అక్కడికక్కడే మృతి చెందగా, కానూళ్ళ రంగమ్మ, బోనం లక్ష్మి, జుట్రు వసంతలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు.
టిడిపితోనే రాష్ట్భ్రావృద్ధి
పటమట, మార్చి 6: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా చేయగల సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులకు గద్దె రామ్మోహన్ ఆదివారం శంకుస్థాపన చేసి పనులను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవశేష ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయగల వ్యక్తి చంద్రబాబునాయుడనే విషయాన్ని ప్రజలు నమ్మి తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగించారన్నారు. ప్రజల నమ్మకానికి తగినట్లుగానే చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేస్తున్నాడని కొనియాడారు. 4వ డివిజన్‌లో బెత్లహామ్‌నగర్ కొండ ప్రాంతంలో ఏడు లక్షల వ్యయంతో చేపట్టిన మెట్ల నిర్మాణానికి, యలశిలవారివీధిలో 10 లక్షల వ్యయంతో జరగనున్న పైప్‌లైన్ నిర్మాణానికి చేపట్టిన పనులకు, బెత్లహామ్ నగర్‌లో యుజిడి పైపులైన్ నిర్మాణానికి రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన పనులకు గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఆరో డివిజన్‌లో సుంకర సత్యనారాయణ రోడ్డు నుంచి జమిందారి వీధి వరకు రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చడంతో పాటుగా డ్రెయిన్ నిర్మాణానికి రూ.17 లక్షలతో చేపట్టిన పనులను గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. 18వ డివిజన్‌లో సెవెంత్‌డే చర్చి సెవెంత్‌డే చర్చి రోడ్డు నిర్మాణానికి రూ.10.87 లక్షల వ్యయంతో చేపట్టిన పనులను, బాడవపేటలో నీటి పైప్‌లైన్ నిర్మాణానికి రూ.17లక్షల వ్యయంతో చేపట్టిన పనులకు, న్యూగిరిపురంలో భూగర్భ, డ్రైనేజి సమస్య పరిష్కారానికి రూ.10 లక్షల వ్యయంతో జరిగే పనులకు గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు బొప్పన భవకుమార్, దాసరి మల్లేశ్వరీ, సహేరా బేగం, పాల జాన్సీ, చెన్నుపాటి గాంధీ, చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. 14వ డివిజన్ రఘు రోడ్డు చివర రూ.11 లక్షల నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 15వ డివిజన్ తారకరామనగర్‌లో రూ.9.30 లక్షల నిధులతో నిర్మాణం జరిగే మెయిన్ రోడ్డుకు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. 13వ డివిజన్ ఫిటింగులపేటలో రూ.10 లక్షలతో నూతనంగా వాటర్ పైప్‌లైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.