శ్రీకాకుళం

ఎండల మల్లన్న ఆలయం అభివృద్ధికి కృషి : మంత్రి అచ్చెన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్కలి, నవంబర్ 21: 50 లక్షల రూపాయలు టూరిజం నిధులతో రావివలసలో గల ఎండల మల్లన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం ఎండలమల్లన్న ఆలయంలో కుటుంబసమేతంగా శాస్త్రోక్తంతో పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దచెరువు గట్టు నుంచి రావివలస దేవాలయానికి భక్తుల రాకపోకలు నిమిత్తం రోడ్డు నిర్మాణం ప్రజలు కోరిక మేరకు తాత్కాలికంగా నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ పనులను ఆదివారం నుంచి ప్రారంభించేందుకు మోటారువెహికల్ ఇన్‌స్పెక్టర్ రమణ, గనులశాఖ ఎడి రమణారావుతో అందుకు అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్తీకసోమవారాలు అనంతరం ఆలయ ప్రాంగణం వద్ద ఆలయ ప్రాంగణంలో బండరాళ్లును తొలగించి ప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా అభివృద్ధి చేయనున్నట్టు ఆయన తెలిపారు. కొత్తమ్మతల్లి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు. 2016 మార్చి నాటికి గ్యాస్ కనెక్షన్ లేనివారు ఉండకుండా చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. ఈ విషయమై గ్యాస్ డీలర్లుకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. టెక్కలి నియోజకవర్గానికి 1300 ఇళ్లు మంజూరు చేశామన్నారు. రావివలస గ్రామంలో 120 దీపం కనెక్షన్‌లు పంపిణీ చేశారు. మెట్‌కోర్ ఎల్లాయిస్ కంపెనీ కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల్లో సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బిఇఇ సత్యానారాయణ, దేవాదాయ శాఖ డిసి ఎన్‌వి ఎస్. ఎన్.మూర్తి, దేవాదాయశాఖ ఎసి శ్యామలదేవి, ఆర్డీవో వెంకటేశ్వరరావు, తహశీల్దార్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ చూపిన పోలీసులకు బహుమతులు
శ్రీకాకుళం(టౌన్), నవంబర్ 21: జిల్లాలో ఇటీవల వివిధ కేసుల్లో ప్రతిభను చూపిన పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ బహుమతులు అందజేశారు. శనివారం స్థానిక పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీరఘట్టంలో ఐదు లక్షల రూపాయల విలువ చేసే గుట్కా, ఖైనీ పట్టుకున్న ఎస్బీ సిఐ వి.గోపీనాథ్, కాశీబుగ్గలో ఎటిఎం దొంగతనం ముఠాను పట్టుకున్న పిసి సూరిబాబు, హోం గార్డు ఎస్.గిరిధర్, అదే సబ్ డివిజన్ పరిధిలో ఆరు దొంగతనాలు కేసుల్లో 18 తులాల బంగారం, 40 తులాల వెండి రికవరీ చేసిన బారువ ఎస్‌ఐ ఇ.శ్రీనివాస్, హెచ్‌సి జె.రూప్‌కుమార్, విపి కొత్తూరు హెచ్‌సి కె.సీతారాంమూర్తి, పిసి డి.విజయకుమార్, ఆర్.నాగార్జున, కె.వైకుంఠరావులకు బహుమతులు అందజేశారు. అలాగే నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌ను అమలుపర్చడం, మహిళ మిస్సింగ్ కేసులో చాకచక్యంగా వ్యవహరించి ఆమెను తిరిగి ఇంటికి చేరవేయడంలో ప్రతిభ చూపినందుకు నరసన్నపేట పిసి కె.శ్రీనివాసరావు, అక్రమ ఇసుక తరలిస్తున్న 37 లారీలను హిరమండలంలో పట్టుకున్న స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ ఎం.వి.యస్.ప్రసాదరావు, ఎస్‌బి హెడ్ కానిస్టేబుల్ ఎస్.రాజేశ్వరరావులకు ఎస్పీ బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఒఎస్‌డి కె.తిరుమలరావు ఉన్నారు.