శ్రీకాకుళం

తోడేస్తారట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం) జిల్లాకు ముఖ్యమైన జలవనరులైన వంశధార, నాగావళి నదుల నీటిని విశాఖపట్నం ప్రజల దాహార్తి తీర్చేందుకు రంగం సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ నదుల నుంచి మిగులు జలాలు లేకున్నా...ఇక్కడ పరిశ్రమలకు అవసరమైన నీటివనరులు సంపూర్తిగా లేకపోయినా...ఒడిశా సర్కార్‌తో జల జగడం సాగునీటికి అడ్డంకైనా... వంశధార, నాగావళి నదుల అనుసంధానంతో రావాడ వరకూ సిక్కోల్ జలవనరులు దారిమళ్ళీంచేందుకు సర్కార్ సుముఖతగా ఉంది. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర నీరుపాదరుదలశాఖ మంత్రి దేవినేని ఉమా విలేఖరుల సమావేశంలో వంశధార, నాగావళి నదుల నీటిని విశాఖ వాసుల దాహార్తి తీర్చేందుకు వినియోగిస్తామని, ఈ వేసవిలో నీటిఎద్దడి లేకుండా చేస్తామంటూ పేర్కొన్నారు. అయితే ఇదే జరిగితే సిక్కోల్ జలసాధన సంవరక్షణ సమితి మరో ఉద్యమానికి వెనుకాడబోమంటూ హెచ్చరిస్తోంది. హిరమండలం వద్ద వంశధార రిజర్వాయర్, వంగరలో మడ్డువలస రిజర్వాయర్ దాదాపు ఖాళీ అయిపోయింది. వంశధార, నాగావళి అనుసంధానంతో రావాడ వరకూ విశాఖ వాసుల కోసం నీటివనరులు దారిమళ్లీంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ ఫలితాలు ఇస్తాయోగాని, రిజర్వాయర్లు దిగువ ప్రాంతం ప్రజల కోసం ఎగువప్రాంత ప్రజల ప్రయోజనాలు బలిపెడుతున్నారని సిక్కోల్ ప్రజలు ఇప్పటికే ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వంశధార రిజర్వాయర్‌లో 20 టిఎంసిలు కనీసం రిజర్వుగా ఉండాల్సిన నీటి వనరులకు కేవలం 57.5 క్యూసెక్కులు మాత్రమే ఉంది. మడ్డువలస రిజర్వాయర్‌లో 3.5 టిఎంసిల నీటినిల్వలు ఉండాల్సివుండగా 60.9 క్యూసెక్కులు మాత్రమే నిల్వలు ఉన్నాయి. ఇకపోతే తోటపల్లి రిజర్వాయర్‌లో 16 టిఎంసిలకు ఎనిమిది సార్లు నిల్వలు నింపేలా 2.5 టిఎంసిలు ప్రస్తుతం ఉండాల్సివుండగా, కేవలం ఒక్క టిఎంసి మాత్రమే నీటినిల్వలు ఉన్నాయి. నారాయణపురం 0.5 టిఎంసిల నిల్వలకు పూర్తిగా ఆవిరైపోయింది. జిల్లా రైతాంగానికి సాగునీరు ఇవ్వలేక, శ్రీకాకుళం నగరపాలకసంస్థ ప్రజలకు తాగునీరు ఇచ్చేందుకు అవస్థలు పడుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రజల దాహార్తిని పాలకులు వంశధార, నాగావళి నదుల నీరు విశాఖపట్నం కోసం తోడేస్తామంటూ సాక్షాత్తు ఇరిగేషన్ మంత్రే అవగాహన లేకుండా పేర్కొనడాన్ని సిక్కోల్ ప్రజలు తప్పుపడుతున్నారు. ఇదే జరిగితే సిక్కోల్ జలసాధన సంవరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు దుప్పల రవీంద్రబాబు, కార్యదర్శి నల్లి ధర్మారావు మరో ఉద్యమానికి సంసిద్ధమవుతామంటూ విలేఖరులకి చెప్పారు.
ఇదిలా ఉండగా, వంశధార రూపశిల్పి సి.ఆర్.ఎం.పట్నాయక్ పుష్కర క్రితం సూచించిన విధంగా తోటపల్లి నీరు రిజర్వాయర్‌కు 15 కిలోమీటర్లు దూరంలో పూర్ణపాడు వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడ నుంచి తాటిపూడి రిజర్వాయర్‌కు నాగావళి నీరు మళ్లీస్తే విశాఖపట్నం వాసుల దాహార్తికి ఢోకావుండదన్న మాటను ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం ఆచరణలో పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇందులోభాగంగానే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకొంటుంది. అయితే తోటపల్లి నుంచి 105 లెవెల్స్ ఉండడంతో పంపింగ్‌తో పైపులైన్లు ద్వారా తోడించేందుకు ఆర్థిక వనరులు అధికమయ్యే పరిస్థితులు ఉంటాయని ఇరిగేషన్ ఇంజనీర్లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. ఇకపోతే మడ్డువలస నుంచి నీటిని తోడేయడానికి ఆస్కారం ఉందని, లెవెల్స్ తగ్గినప్పటికీ రావాడ వరకూ పంపుల ద్వారా పైపులైన్లు గుండా తాగునీటిని పంపవచ్చునంటూ ఇంజనీర్లు రూపొందించిన మరో ప్రణాళిక కూడా ఎపి ఇరిగేషన్ మంత్రి వద్ద సిద్ధంగానే ఉంది. వంశధార - నాగావళి నదులు అనుసంధానం పారాపురం వద్ద (కొత్తూరు, సీతంపేట, పాలకొండ) కాల్వల ద్వారా నారాయణపురం ఆయకట్టు ముందు చేసేందుకు సాధ్యసాధ్యాలు సైతం రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. మరో ఆలోచనతో హిరమండలం రిజర్వాయర్ నుంచి వెన్నులవలస రిజర్వాయర్ ఏర్పాటుతో నాగావళికి వంశధార అనుసంధానం చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ, వంశధార, నాగావళి నదుల మిగులు జలాలు లేకుండా పక్క జిల్లాలకు సాగు,తాగు నీటి సమస్యలు తీర్చేందుకు వినియోగిస్తే సిక్కోల్ రైతాంగం అల్లాడిపోవల్సిందేనంటూ ఇరిగేషన్ ఇంజనీర్లు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిక్కోల్ దాహార్తి తీర్చేందుకు మడ్డువలస నీరే ఆధారంగా ప్రతీ వేసవి ఎద్దడిలో కన్పిస్తుంది. అటువంటి మడ్డువలస నీటిని తోడేస్తామంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ప్రజలు నీటియుద్ధాలకు సిద్ధమవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరిశ్రమలకు జలవనరులు కొరతే
వెనుకబడిన జిల్లాలోని ప్రధాన నదుల నుంచి విశాఖ నగర దాహార్తి తీర్చాలని ప్రభుత్వం భావించినట్లు కార్యరూపం దాలిస్తే ఇక్కడ నెలకొల్పబోయే పరిశ్రమలకు జలవనరులు కొరత తప్పదని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చెప్పకనే చెబుతున్నారు. సిక్కోల్‌లో ఇప్పటికే అణుపార్కు (కొవ్వాడ), ట్రైమాక్స్ (గార, సంతబొమ్మాళి), థర్మల్ విద్యుత్‌కేంద్రం (పోలాకి), భావనపాడు పోర్టు(సంతబొమ్మాళి) తదితర పరిశ్రమలకు వంశధార, నాగావళి జలవనరులే ప్రధాన అవసరం. ఇటువంటి జలవనరులను పక్కజిల్లాల కోసం తోడేస్తామంటూ సర్కార్ ప్రకటించడంపై పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

అర్చకుల నిరసన శంఖారావం
* భిక్షాటన, ధర్నాలతో ప్రదర్శనలు
* డిమాండ్లు పరిష్కరించాలంటూ
ఏసికి వినతిపత్రం
శ్రీకాకుళం(కల్చరల్), మార్చి 24:ఆలయాలను, వాటిని నడిపిస్తున్న ఆగమాలను నిరంతరం కాపాడుతున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని అర్చకుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవచూపడం లేదంటూ గురువారం జిల్లాకు చెందిన అర్చకులు రోడెక్కారు. ఈ మేరకు పాలకొండరోడ్‌లోని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం నుండి ఏడురోడ్ల కూడలి వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. దారిపొడువున బస్సులు, ఆటోలు, దుకాణాల వద్ద భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తంచేశారు. ఏడురోడ్ల కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంక్షేమసంఘం ప్రతినిధులు ఐలూరి శ్రీనివాసదీక్షితులు, కొత్తలంక మురళీకృష్ణలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన తీర్పుప్రకారం రాష్ట్రంలో ఉన్న హిందూ దేవాలయ వ్యవస్థను, సంస్కృతీ సంప్రదాయాలను రక్షించి వాటిని కాపాడాలని, అలాగే తరతరాలుగా ఆలయాలను నమ్ముకుని జీవిస్తున్న అర్చకుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తీర్పు వచ్చి 22సంవ్సరాలు గడిచినా 6ఎ దేవాలయాల్లో తప్ప 6బి, 6సి దేవాలయాల్లో పిఆర్‌సి పూర్తిస్థాయిలో వర్తింపజేయడం లేదన్నారు. గుమస్తా, మేనేజర్లు, ఇవోలకు రూ.30వేల నుండి రూ.60వేల పైబడి జీతాలు చెల్లిస్తున్నా 80శాతం అలయాల్లో అర్చకులకు మాత్రం అతిస్వల్ప జీతాలు చెల్లిస్తున్నారన్నారు. తమ సమస్యలపై గతంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి లకు విన్నవించినా పరిష్కారం దిశగా చొరవ తీసుకోవడం లేదన్నారు. ఏప్రిల్ 15లోగ తమ డిమాండ్‌లను పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆలయాల్లో ఆర్జితసేవలు నిలిపేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టంచేశారు. ర్యాలీ, ధర్నా అనంతరం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వి.శ్యామలాదేవికి వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో ఉత్తరాంధ్రా అర్చక సంఘం ప్రతినిధులు పెంటా శ్రీనివాసశర్మ, రేజేటి శ్రీనివాసాచార్యులు, బంకుపల్లి శేషాచార్యులు పలువురు అర్చకులు పాల్గొన్నారు.

పౌష్టికాహారంతోనే క్షయ నియంత్రణ
* ప్రతీ రోగికి రూ.5వేల మందులు
* జెడ్పి చైర్ పర్సన్ ధనలక్ష్మీ
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మార్చి 24: మంచి పౌష్టికాహారం తీసుకుంటే క్షయవ్యాధి తొందరగా నయం అవుతుందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ స్పష్టంచేశారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. క్షయ రోగులు డాక్టర్ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించినట్లయితే ఇతరులకు సోకే అవకాశం ఉండదన్నారు. ముఖ్యంగా పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. క్షయనివారణ కోసం ప్రభుత్వం ప్రతీ రోగికి రూ.5వేల వరకు మందులు ఉచితంగా అందజేస్తోందని వివరించారు. సమష్టిగా క్షయ నివారణకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తొలుత జ్యోతిప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని చైర్ పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్షయవ్యాధి నయం అయిన 18మందికి చీరలు, దోవతలు పంపిణీ చేశారు. అలాగే ఈరోగులకు ఉత్తమ సేవలు అందించిన డాక్టర్లు, సూపర్‌వైజర్లు, ల్యాబ్‌టెక్నీషియన్లకు జ్ఞాపికలు అందజేసి ఆమె సత్కరించారు. డిఎంఅండ్ హెచ్‌వో ఆర్. శ్యామల మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసిన మందులు చాలా ఖరీదయిననవి ఇవి మధ్యలో వాడటం ఆపేసి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం వ్యాధిగ్రస్తులు మానుకోవాలన్నారు. క్రమం తప్పకుండా మందులు వాడినట్లయితే వ్యాధి తొందరగా నయం అవుతుందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే మందుల వలన వ్యాధి తగ్గదనే అపోహలు ప్రజల్లో పోవాలన్నారు. జిల్లాక్షయ నివారణాధికారి డాక్టర్ జి.రత్నకుమారి రెండు వారాలకు మించి దగ్గురావడం కాని, జ్వరం బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి తనిఖీ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర ప్రచారాధికారి జి.కొండలరావు, జిల్లా టిబి అధికారి హనరోరియర్, సెక్రటరీ మంత్రి వెంకటస్వామి, డాక్టర్లు సిబ్బంది ఉన్నారు.

మింగేసిన నీటికుంట
* స్నానానికి దిగి
ఇద్దరు చిన్నారులు మృతి
* విషాదంలో
సూదికొండ
పలాస, మార్చి 24: తోటి బడిపిల్లల తో అప్పటివరకు కలిసి ఆనందంగా గడుపుతూ పాఠశాల మధ్యాహ్నా భోజ న పథకాన్ని ఆరగించి ఇంటికి వెళ్లి పుస్తకాలను విడిచి ఆటవిడుపు కోసం వెళ్లిన ఇద్దరు చిన్నారులు జయరామచంద్రపురంలోని కీర్తిసాగరంలో విగతజీవులుగా మారడంతో సూదికొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాశీబుగ్గ పోలీసుల కథనం మేరకు కోతి మహేంద్ర(11), వడ్డ కార్తీక్(10)తోపాటు సింహాద్రి, ఇంద్ర నలుగురూ కలిసి పాఠశాల్లో భోజనం అనంతరం ఆటవిడుపు కోసం సూదికొండ నుంచి జెఆర్‌సి పురంలోని కీర్తిసాగరంలోకి వచ్చారు. మహేంద్ర, కార్తీక్‌లు స్నానం చేసేందు కు నీటిగుంటలో దిగగా ఇంద్ర, సింహాద్రిలు వారి రాక కోసం ఒడ్డున నిలబడి చూస్తున్నారు. దిగినవారు ఎంతకీ బయటకు రాకపోవడంతో ఒడ్డును ఉన్న ఇద్దరు రోదిస్తూ సమీపంలోని ఇటుకలు తయారు చేస్తున్న వారి వద్దకు వెళ్లి తమ స్నేహితులు నీటిలో దిగి బయటకు రాలేదని, వారిని రక్షించాలని కోరడంతో అక్కడ పనులు చేస్తున్నవారు పరుగున వచ్చి నీటి గుంటలో దిగి గాలించారు. నీటి అడుగున ఇద్దరూ లభ్యం కావడం తో వారిని బయటకు తీసుకువచ్చారు. అప్పటికే వారు మృతి చెందారు. విష యం తెలుసుకున్న గ్రామస్థులు, తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. నలుగురు స్నేహితులు సూదికొండ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. మహేంద్ర తల్లిదండ్రులు శ్రీను, ఆదిలక్ష్మిలు కూలీలుగా పనిచేస్తున్నారు. వారికి మరో కుమారుడు, మరో కుమార్తె ఉన్నారు. కార్తీక్ తల్లిదండ్రులు బబ్లు, సావిత్రిలకు కుమారుడు, కుమార్తె కాగా, పెద్ద కుమారుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాశీబుగ్గ ఎస్‌ఐ సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ చేసా రు. మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భానుడి ప్రతాపానికి ముగ్గురు మృతి
రాజాం, మార్చి 24: ఉదయం 7 గం టలు నుంచి సాయంత్రం వరకు తీక్షణమైన ఎండ వేడిమికి తాళలేక ముగ్గురు వృద్ధులు మృతువాత పడ్డారు. సారధి గ్రామంలో ఒకేరోజు బూరాడ సీతమ్మ(58), తోలాపు తవుడమ్మ(65) అనే పింఛన్‌దారులు మృతి చెందారు. గురువారం గ్రామానికి చెందిన ఆరిక అప్పలసూరమ్మ(60) కూడా మృతి చెందారు. రానున్న రోజుల్లో ఎండల మరింత తీవ్రతరమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల రాజాం ప్రాం తంలో అక్కడకక్కడ చిరుజల్లులు కురిసిన తరువాత ఎండ తీవ్రత మరింత పెరిగింది. మార్చి నెలలో మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని మే నెలలో ఉన్న పరిస్థితులను ఇప్పుడు చూడాల్సి వస్తోందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకు తిరగరాదని వైద్యులు చంద్రశేఖర్‌నాయుడు, హరిబాబులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వయోవృద్ధులు, గర్భిణుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

రేపు జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన
బలగ, మార్చి 24: రాష్ట్ర కార్మిక శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయడు ఈ నెల 26వ తేదీన జిల్లా లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎంపి కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో టిడిపి నేతలు పేర్కొన్నారు. శ్రీకాకుళం పరిధిలోని పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనడంతోపాటు మంత్రి అచ్చెన్నాయుడు జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్చించారు. శ్రీకాకుళం, గార మండలాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టిడిపి నేతలు పేర్కొన్నారు.ఈ నెల 26వ తేదీన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జన్మదినం పురష్కరించుకుని పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య పట్టణంలోని దేవాలయాల్లో, మసీదు, చర్చిల్లో పూజలను పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని, తొమ్మిది గంటలకు పార్లమెంటు కార్యాలయంలో కేక్ కటింగ్‌ను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, టిడిపి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో జరుపుకుంటారు.అలాగే 10 గంటల నుంచి ఎం.పి కార్యాలం వద్ద రక్తదాన శిబిరాన్ని ద్వారపు అజిత్‌కుమార్, రాహుల్, తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 11 గంటలకు బోయిన గోవిందరాజులు ఆధ్వర్యంలో రిక్షాకార్మికులకు దుస్తుల పంపిణీ, 12 గంటల నుంచి శరణ్య మనోవికాస కేం ద్రం, వృద్ధాశ్రమం, బెహరా మనో వికాస కేంద్రాలలో పండ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ సమావేశంలో టిడిపి నేతలు ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, మాదారపు వెంకటేష్, బోయిన గోవిందరాజు, మహీబుల్లాఖాన్, కొర్ను నాగార్జున ప్రతాప్, చిట్టి నాగభూషణరావు, రమణ మాదిగ, జామి భీమశంకర్, జామి నాగరాజు, చింతు సుధాకర్, చిట్టి మోహన్, సీర రమణ తదితరులు పాల్గొన్నారు.

తల్లి రొయ్య కేంద్రానికి 30 ఎకరాలు
* వౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు
ఎచ్చెర్ల, మార్చి 24: మండలంలోని కుప్పిలి సమీపంలో (ఒనామి) తల్లిరొయ్య కేంద్రానికి థాయిలాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సర్వే నెంబర్ 505లో 30 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమి మార్కెట్ విలువ పదిలక్షల వంతున రూ.3కోట్లు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. ఈ మేరకు ఈ కేంద్రానికి మరిన్ని వౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా అధికారుల పర్యవేక్షణలో సర్వే నిర్వహించారు. ఆక్వారైతులు వైరస్‌బారిన పడకుండా ఈ తల్లిరొయ్యి కేంద్రం ఆదుకునేలా ఏర్పాటు అవుతున్నట్లు సంబంధిత అధికారులు స్పష్టంచేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లు, విద్యుత్ వంటి వౌలి క సదుపాయాలు కల్పించేలా పనులు వేగవంతం అయ్యాయి. సీపి ఆక్వా వైస్ చైర్మన్(చెన్నై), మోహన్‌దాస్ సాంకేతిక సలహాదారుడు కృష్ణమోహన్, డుమా పిడి ఆర్.కూర్మనాథ్, తహశీల్దార్ బంద రు వెంకటరావులు తల్లికేంద్రం ఏర్పాటుకు కావాల్సిన స్థలానికి ఎటువంటి వౌళిక సదుపాయాలు కల్పించాలన్న అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపా రు. వీరితోపాటు మత్స్యశాఖ డిడి యాకూబ్‌భాషా, ట్రాన్స్‌కో ఏడిఇ ప్రసా ద్, ఏఇ రవికుమార్, సర్వేయర్ రామ్‌గణపతి, విఆర్‌వో శ్రీనువాసరావుఉన్నారు.