శ్రీకాకుళం

రామా... కనవేమిరా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
ఉత్తరాయణం.. చాంద్రమానం.. శ్రీ మన్మథనామసంవత్సరం చివరి రోజులు.. జిల్లాలో ఏ దేవాలయానికి వెళ్ళినా పూజారి కండువాకు నల్లబాడ్జి పెట్టుకుని నిరసనదీక్షలో కనపడుతున్నాడు. నివేదన చేసిన ప్రసాదంతోపాటు ఓ ఆవేదన పత్రం కూడా భక్తుల చేతులో పెడుతున్నాడు. దేవాదాయశాఖ పరిధిలో గల ఆలయాల్లో పనిచేసే అర్చకులకు పిఆర్‌సి అమలు చేయకపోగా, కనీస వేతనాలు సకాలంలో ఇవ్వని టిడిపి పాలకులకు వసంతనవరాత్రులు ముగిసాక... శ్రీరామనవమి ఉదయం అర్చన, మహానివేదన మాత్రం చేసి గుడి తలుపులు బిడాయించి కూచోక తప్పదని ఆవేదన వెలుబుచ్చుతున్నారు. హక్కుల సాధన కోసం సంస్థల్లో నిరసనలు, ఆందోళనలు మాములే. అయితే, ‘్భగవంతునికి, భక్తునికి అనుసంధానమ’నుకునే దేవస్థానాల అర్చకశ్రేణుల్లో ఇలాంటి ‘ట్రేడ్ యూనియన్ చైతన్యం’ మాత్రం నవ్యాంధ్రప్రదేశ్‌కు అరిష్టమని పెద్దలు హెచ్చరిస్తున్నారు. దేవుడినే నమ్ముకుని, దేవుడి దగ్గరే పడిఉండి, దేవుడి సేవలూ కైంకర్యాల్లో ఎల్లవేళలా మునిగితేలే పూజారులు సైతం దిక్కులేని వారయ్యామని, గురువారం భిక్షాటన చేసి ప్రభుత్వానికి తమ నిరసన చెప్పినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది ప్రజలకు భక్తివిశ్వాసాలు కలిగిన పవిత్ర దేవస్థానాలపట్ల మొదటినుంచీ టిడిపి ప్రభుత్వ వైఖరి తీరు ఇంతేనని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు.
అమలు కాని ధార్మిక పరిషత్ ప్రతిపాదన
టిడిపి సర్కార్‌లో అర్ధశతాబ్దిగా ఉన్న హిందూ దేవస్థానాల్లో మాత్రం పద్దులురాసే గుమస్తా... పూజలు చేసే పూజారి కంటే గొప్ప. జిల్లాలో దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న 4,231 దేవాలయాల్లో గవర్నమెంటు పేస్కేల్సు అర్చకులకు వర్తింపచేసింది కేవలం 128 దేవస్థానాల్లోనేనట. మిగిలిన గుడుల్లో పూజారుల పాట్లు అన్నీఇన్నీ కావు. ఆదాయం లేదన్న కారణంతో అర్చకులకు జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. ఇటీవల ధార్మిక పరిషత్ నెలకు రూ.10 వేలు కనీస జీతాన్ని ప్రతిపాదించినా అది అమలు కావడం లేదు సరికదా ప్రస్తుతం అందాల్సిన నెలకు రూ. అయిదు వేల జీతం కూడా అందక అర్చకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో అల్పాదాయం ఉన్న 6సి కేటగిరిలోని దేవాలయాల అర్చకుల పరిస్థితి దయనీయంగా ఉంది.
భూములు అపారం... ఆదాయం అంతంత మాత్రం
దేవాలయం పరిధిలో భూములు ఉన్నా వాటి కౌలు ఆదాయం అంతంతామాత్రంగా ఉంటుంది. ఎకరానికి గరిష్ఠింగా నాలుగు బస్తాలు, బస్తాకు రూ.600 ఆదాయంగా చూపడంతో వార్షిక రాబడి అంతంత మాత్రమే. కౌలుదారులు, మేనేజర్లు భూముల ఆదాయం, వేలం వ్యవహారం నడుపుతుండటంతో ఆదాయానికి గండిపడుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక దూపదీపనైవేద్యాలకు నెలకు రూ.500 ఇవ్వాల్సి ఉన్న నాలుగు నెలలు దాటినా అందకపోవడంతో ఆ ఖర్చులు కూడా అర్చకుడికి తడిసిమోపెడవుతోంది. ఉత్సవాలు నిర్వహించాలన్న అల్పాదాయం ఉన్న కారణంగా జరిపించలేకపోతున్నారు. అర్చకుల పరిస్థితి ఇలా ఉంటే... వీటిని పర్యవేక్షిస్తున్న ఇవోలు, మేనేజర్లు జీతాలకు ఇబ్బంది ఉండటం లేదు. ఒక ఇవో లేదా మేనేజర్ పర్యవేక్షణలో గ్రూపు దేవాలయాలు ఉండటంతో వాటి ఆదాయంతో వారి జీతాలకు డోకాలేకపోతోందని అర్చకులు పేర్కొంటున్నారు.