శ్రీకాకుళం

కళామతల్లి బిడ్డలకు పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), మార్చి 27: ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లాకు చెందిన పలువురు కళాకారులను వివిధ సమాఖ్యలు పురస్కారాలతో ఘనంగా సత్కరించాయి. ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన సాంఘిక నటుడు బగ్గం వెంకటరమణాజీని శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య ముంగిట సత్కారం పేరుతో ఆయన ఇంటికి వెళ్లి రంగస్థల పురస్కారం ప్రదానం చేసి నటనారంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కీర్తిశేషులు నాటిక ద్వారా మంచినటుడుగా గుర్తింపు పొందిన రమణాజీ ఎన్నో పరిషత్ పోటీల్లో పాల్గొని అవార్డులు అందుకున్నట్టు పేర్కొన్నారు. గడచిన తొమ్మిదేళ్ళుగా ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఏటా మార్చి 27న ముంగిట సత్కారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సమాఖ్య ప్రతినిధులు ఎల్.రామలింగస్వామి, పన్నాల నర్శింహమూర్తి, చిట్టి వెంకటరావు, నిక్కు హరిసత్యనారాయణ తదితరులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పట్టణానికి చెందిన నాట్యగురువు రఘుపాత్రుని శ్రీకాంత్‌ను రంగస్థల పురస్కారంతో విశాఖపట్నంకు చెందిన కెవి మెమోరియల్ ఆర్ట్స్ ఆసోసియేషన్ ఆదివారం సత్కరించింది.
నాట్యరంగంలో శ్రీకాంత్ చేస్తున్న విశేష కృషిని గుర్తించి ఈ సత్కారం చేసినట్టు అసోసియేషన్ ప్రతినిధి పి.శివప్రసాద్ తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి విశాఖపట్నం వుడా పార్కు వైశాఖి కళావేదికలో జరిగిన కార్యక్రమంలో పెద్దపాడుకు చెందిన నటుడు కలగ ఆదికేశవరావు, కొత్తూరుకు చెందిన నటి సిహెచ్. మోహినీలకు రంగస్థల పురస్కారాలు ప్రదానం చేశారు.

ఆపదలో ఆదుకునే మల్లేశ్వరుడు
సారవకోట, మార్చి 27: మండలంలోని గుమ్మపాడు గ్రామంలో గల మల్లేశ్వరస్వామి ఆలయ 19వ వార్షికోత్సవాలు సోమవారం నుండి మూడు రోజులపాటు జరగనున్నాయి. ఈ గ్రామానికి చెందిన కత్తిరి అప్పలస్వామి, కత్తిరి వీరయ్య మాస్టారు దంపతులచే మల్లేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటినుండి ప్రతీ ఏడాది మూడు రోజులపాటు యాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి కత్తిరి రాంబాబు, రామకృష్ణారావు దంపతులచే కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ తెలిపారు. అదే విధంగా చివరి రోజైన బుధవారం ఉదయం అభిషేకాలతోపాటు, మధ్యాహ్నం రెండు గంటలకు అమ్మవారి లలితాసహస్త్ర నామార్చనలతో లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారని ఆయన తెలిపారు. యాత్రోత్సవాల సందర్భంగా మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్టు స్పష్టంచేశారు.