శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ద్యుత్ బిల్లు రూ.5వేలు దాటితే బ్యాంకింగ్ చెల్లింపులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, మార్చి 13: ఇకపై ఐదువేల రూపాయలకుపైగా విద్యుత్ బిల్లు జారీ కాబడే వినియోగదార్ల నుంచి బ్యాంకింగ్ లేక డిజిటల్ చెల్లింపుల ద్వారానే తమ వసూళ్ల ప్రక్రియ కొనసాగుతుందని ఏపీఎస్‌పీడీసీఎల్ సూపరింటిండెంట్ ఇంజనీర్ కె విజయకుమార్‌రెడ్డి తెలిపారు. ఈ నిబంధన అనతికాలంలోనే పూర్తిస్థాయిలో అమలులోకి రానుందన్నారు. మంగళవారం ఏపీఎస్‌సీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ లిమిటెడ్) ఆత్మకూరు డీఈఈ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని యంత్రాంగంతో ప్రత్యేంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుత వేసవికాలంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరగడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి కింద 16వందల యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. అందులో ఇప్పటికే వెయ్యి యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా సెల్‌ఫోన్ ద్వారా వ్యవసాయ మోటార్ల స్విచాన్/స్విచాఫ్ నిర్వహించే ప్రక్రియ ఇప్పటికే జిల్లాలోని మనుబోలు, నెల్లూరు రూరల్, పొదలకూరు మండలాల్లో విస్తృతంగా కొనసాగుతుందన్నారు. దీనికోసమై మోటార్లను మార్పుదల చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని మిగిలిన మండలాల్లో కూడా దరఖాస్తులు చేసుకునే సంఖ్యను అనుసరించి ఈ ప్రక్రియ అమలులోకి తీసుకొస్తామన్నారు. అదేవిధంగా వినియోగదారులు విద్యుత్ సరఫరాపరంగా తమ ఫిర్యాదులను 1912 ఉచిత ఫోన్ నెంబర్‌కు డయల్ చేయవచ్చన్నారు. ఇలా వచ్చే ఫిర్యాదుల్లో లోఓల్టేజిపరంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు సంబంధించి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోజు వ్యవధిలో, అర్బన్ ఏరియాల్లో 12 గంటల్లోగా సమస్యను పరిష్కరిస్తామన్నారు.