శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

దొంగ పోరాటాలతో ప్రత్యేకహోదా సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, ఏప్రిల్ 20 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న దొంగ పోరాటాలతో ప్రత్యేక హోదా సాధ్యం కాదని, నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న జగన్‌తోనే సాధ్యపడుతుందని వైకాపా జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న వైకాపా జిల్లా కార్యాలయంలో విలేఖర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాకాణి గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం చంద్రబాబునాయుడు ధర్మపోరాటం దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకు ధర్మం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. ఐదు కోట్ల ఆంధ్రుల కోసం ఐదుగురు వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి పోరాటం చేస్తున్నారన్నారు. ఎవరైనా ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తే ఇక్కడ కాదు ఢిల్లీలో చేయండని చెప్పే చంద్రబాబుకు ఆ నీతి నియమాలు వర్తించవా అని సూటిగా ప్రశ్నించారు. వైకాపా ఎంపీలు వయస్సును సైతం లెక్కచేయకుండా రాజీనామాలు చేసి హోదా కోసం పారాడుతున్నా కనీసం చంద్రబాబు మద్దతు ప్రకటించకపోవడం రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా ప్రత్యేకహోదా సాధన కోసం తమతో కలసి పోరాటం చేయాలన్నారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చిన తరువాత రెండవ సంవత్సరం పార్లమెంటులో క్రమబద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశామన్నారు. గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే గత ఎన్నికల సమయంలో తిరుపతి సభలో నరేంద్రమోదీ, చంద్రబాబు 15 సంవత్సరాలు ప్రత్యేకహోదా కావాలని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేశారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు తామంతా రాజీనామాలు చేసినా పోరాటం ఆగదన్నారు. ఖాళీగా ఉన్న ఎంపీ పదవులకు ఎన్నికలు వస్తాయని, మళ్లీ వైకాపా ఎంపీలంతా పోటీ చేసి గెలిచి ప్రత్యేకహోదా పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. వయస్సులో చిన్నవాడైనా వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తెలివితేటలతో ప్రత్యేకహోదా సాధనకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. ఆయనకు తామంతా రుణపడి ఉన్నామన్నారు. ఈ సమావేశంలో వెంకటాచలం జెడ్పీటీసీ వెంకటశేషయ్య, ముత్తుకూరు మండల పార్టీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

తాగునీటి కోసం మహిళల ఆందోళన
మనుబోలు, ఏప్రిల్ 20 : గుక్కెడు మంచినీటి కోసం తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ మండల పరిధిలోని చెరుకుముడి గ్రామంలోని బీసీ కాలనీ, దళితవాడల మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీలో సుమారు 200 కుటుంబాలు ఉన్నాయన్నారు. మినీ వాటర్ స్కీం ద్వారా పంచాయతీ అధికారులు తాగునీరు సరఫరా చేస్తున్నారని తెలిపారు. అయితే గత 10రోజుల క్రితం మినీ వాటర్ స్కీం మోటారు మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు మోటారు బాగు చేయకపోవడంతో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నట్లు వాపోయారు. తాగునీటి కోసం సుదూర ప్రాంతాల్లోని ఏటి కాలువ వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన మోటారు బాగు చేసి తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు.