శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైతుల సమస్యలపై సోమిరెడ్డి దృష్టి పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 20 : వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతుల ఇబ్బందులపై దృష్టి సారించాలని, జగన్ గురించి తగిన సమయంలో ప్రజలు నిర్ణయం తీసుకుంటారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు మండలానికి చెందిన రైతులతో వరి ధాన్యం మోసుకుంటూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో వారు తెచ్చిన వరి ధాన్యం మూటలను దించి, అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాత్రింబవళ్లు కష్టించి పండించిన ధాన్యం అమ్ముకోడానికి రైతులు పడుతున్న ఇబ్బందులు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రోజూ సోమిరెడ్డి ఎక్కువ సమయం జగన్‌మోహన్‌రెడ్డిని నిందించడానికే కేటాయిస్తున్నారే తప్ప రైతుల గురించి మాత్రం కాదని అన్నారు. మీ ముఖ్యమంత్రితో చెప్పి జగన్ తిట్ల పురాణం అనే శాఖను ఏర్పాటు చేసుకొని దానికి మంత్రిగా వ్యవహరించాలని ఆయన ఎద్దేవా చేశారు. గడిచిన నాలుగేళ్ల నుంచి రైతులు పడుతున్న బాధలు చూస్తున్నానని, మరీ ఈ సంవత్సరం అధికంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు నెల్లూరు మండలంలోని పాతవెల్లంటి, కొత్తవెల్లంటి, అప్పయకండ్రిగ, పెనుబర్తి, దొంతాలి, కొమ్మరిపూడి, ఉప్పుటూరు, గొల్లకందుకూరు, సౌత్‌మోపూరు, మాదరాజుగూడూరు, కందమూరు, ములుముడి గ్రామాలలో సుమారుగా 225 లోడ్ల ధాన్యం లారీలు పలు రైస్ మిల్లుల వద్ద నిలబడిపోయి ఉన్నాయని ఆయన అన్నారు. ఆ ధాన్యాన్ని అన్‌లోడ్ చేయాలంటే ట్రిప్‌షీట్, ఆధార్ కార్డు, నెమ్ము, తరుగు ఇలా పలు వివరాలను చూపిస్తూ రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు, ప్రభుత్వం, రైస్ మిల్లుల యాజమాన్యం మధ్య మూడు స్తంభాల ఆటలో పేద రైతు నలిగిపోతున్నాడని అన్నారు. ఇక నుంచి ప్రతి రైస్ మిల్లు వద్ద వైకాపా నాయకులు, కార్యకర్తలు నిలబడతారని, రైతులకు సమస్యలు సృష్టించే వారు ఎవరైనా సరే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం అధికారులను కలిసిన తరువాత శనివారం సాయంత్రం లోపు ధాన్యం సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మండల కన్వీనర్ పుచ్చలపల్లి రామప్రసాద్‌రెడ్డి, సుమంత్‌రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు, వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

రైస్ మిల్లుల్లో జేసీ ఆకస్మిక తనిఖీలు
కోవూరు, ఏప్రిల్ 20: జాయింట్ కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఉదయం మండల పరిధిలోని పలు రైస్‌మిల్లులను విజిలెన్స్ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. పడుగుపాడు జెమ్మిపాళెం గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న ఓ రైస్‌మిల్లు, రైల్వే ఫీడర్స్‌రోడ్డులోని మరో రైస్ మిల్లు, పాటూరు రోడ్డులోని ఇంకో రైస్‌మిల్లును ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులలో ప్రజా పంపిణీ కోసం గోడౌన్‌లకు తరలించాల్సిన సీఎంఆర్ రైస్ బ్యాగులు ఏమైనా ఉన్నాయా, అలాగే ధాన్యం సేకరణ మిల్లర్లు రైతుల నుంచి పారదర్శకంగా చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఆమెతోపాటు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.