శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జగన్‌కు దమ్ముంటే మోదీని ప్రశ్నించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఏప్రిల్ 20 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే చిత్తశుద్ధి వైకాపా నాయకులకు ఉంటే రాజకీయ నాటకాలు ఆడటం మానుకోవాలని, ముందు జగన్‌మోహన్‌రెడ్డికి దమ్ముంటే ప్రధాని మోదీని ప్రత్యేక హోదాపై ప్రశ్నించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న ధర్మాపోరాట దీక్షకు మద్దతుగా వెంకటాచలంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన తనయుడు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో కలిసి సామూహీక ధర్మ పోరాట దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత ఉదయం 6 గంటల ప్రాంతంలో మండలంలోని గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమంలో మంత్రి సోమిరెడ్డి, తనయుడు రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీక్ష ప్రాంగణానికి చేరుకున్నారు. దీక్ష ప్రాంగణంలో తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దీక్షలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు పైగానే కూర్చున్నారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, అంగన్‌వాడీ, వెలుగు మహిళలు, ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసి, ఓసీ పలు సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గంలోని ప్రజలు, మహిళలు, యువత, చిన్నారులు, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అధికారులు, రైతు నాయకులు, వైద్యులు, ఉపాధ్యాయులు, పలు స్వచ్ఛంధ సంస్థల నిర్వాహకులు, లారీ అసోసియేషన్ నాయకులు, కార్మికులు తదితరులు భారీగా తరలివచ్చి ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతూ మంత్రి సోమిరెడ్డికి తమ సంఘీభావం తెలిపారు. అనంతరం మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ బీజేపీతో వైకాపా నాయకులు కుమ్మకై ప్రత్యేక హోదాపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కుట్రలో భాగంగానే భాజపాతోపాటు ప్రధాని మోదీపై వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విమర్శలు, ఆరోపణలు కాని చేయడం లేదన్నారు. పీఎంవో చుట్టూ వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి ప్రదక్షణలు చేయడాన్ని ఏమనుకోవాలని ఆయన ప్రశ్నించారు. వైకాపాకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీపై బురద చల్లడం, అర్థరహిత విమర్శలు, ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ఏపీపై కేంద్రప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై, ఏపీకి జరుగుతున్న అన్యాయంపై, ప్రత్యేక హోదాపై మాట్లాడాలని జగన్‌మోహన్‌రెడ్డితోపాటు వైకాపా నాయకులకు ఆయన హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ప్రధాని మోదీ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా సాధనకు, విభజన చట్టంలోని హామీల అమలుకోసం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినమైన, జన్మనిచ్చిన భూమి కోసం ధర్మా పోరాట దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వెంకటాచలం మండల టీడీపీ అధ్యక్షుడు నాగేంద్ర ప్రసాద్, నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రగతి నివేదికలను సంక్షిప్తంగా అందచేయండి
* జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు
నెల్లూరు, ఏప్రిల్ 20 : అమరావతిలో ఈ నెల 26, 27వ తేదీలలో జరగనున్న కలెక్టర్ల సదస్సుకు సంబంధించి జిల్లా శాఖాధికారులు ఆయా శాఖల ప్రగతి నివేదికలను సంక్షిప్తంగా అందచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను కోరారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం లక్ష్యసాధన, లక్ష్యసాధనలో ఏర్పడిన సమస్యలను, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరాలను త్వరతిగతిన అందించాలని ఆయన కోరారు. రాబోవు కాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి నివేదికలలో పొందుపరచాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ -2 వెంకటసుబ్బారెడ్డి, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, మార్కెటింగ్ శాఖ సహాయయ సంచాలకులు ఉపేంద్రకుమార్, ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ సాల్మారాజు, వివిధ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.