శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బాబు దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, ఏప్రిల్ 20 : విభజనతో నష్టపోయిన రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్ష చేస్తున్నారని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు సంఘీభావంగా స్థానిక ఆత్మకూరు బస్టాండు వద్ద గల పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద మంత్రి పొంగూరు నారాయణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకుముందు ఆయన స్థానిక రంగనాయకులస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జులు ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీమంత్రి బల్లి దుర్గాప్రసాదరావు, తాళ్లపాక అనూరాధ, ఆనం జయకుమార్‌రెడ్డి, కార్పొరేటర్లు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరంలో ఆర్యవైశ్య, బలిజ, రజక, బీసీ, మహిళా, బ్రాహ్మణ, ముస్లిం, మైనార్టీ, ఎస్సీ, క్రైస్తవ సంఘాల నాయకులు, ప్రతినిధులు కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, రెవెన్యూ అసోసియేషన్ల ప్రతినిధులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి దీక్ష చేస్తుంటే వైకాపా, జనసేన పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకుంటానని హామీ ఇచ్చిన మోదీ, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బీజేపీ ప్రభుత్వం, వైకాపాతో కలిసి ఆంధ్రప్రదేశ్ మీద కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఎవరు సహకరించకపోయినా, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముఖ్యమంత్రి దూరదృష్టితో రాజధాని నిర్మాణం జరిగి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన హోదాతో పాటు 18 హామీల అమలు మీద చంద్రబాబు కేంద్రంతో యుద్ధం ప్రకటించారని, మోదీపై పోరాడుతున్న మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబేనని, జన్మదినాన్ని కూడా జరుపుకోకుండా దీక్ష చేయడం రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల చంద్రబాబుకున్న ప్రేమని తెలియపరుస్తుందని వివరించారు. పలువురు నేతలు ఈ దీక్షకు సంఘీభావం ప్రకటించారు.