శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అభివృద్ధిని అడ్డుకుంటున్న వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట, ఏప్రిల్ 23: రాష్ట్రంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిని ప్రతిపక్ష వైకాపా అడ్డుకుంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. తాను రాజకీయ ఆరంగ్రేటం నుండి స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నానని, తన వద్ద అక్రమార్జనే ఉంటే ప్రతిపక్షం తట్టుకోగలదా అని ఆయన ప్రశ్నించారు. నూతనంగా నాయుడుపేట రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైన అనతికాలంలోనే రెండు కోట్ల యాభై లక్షల వ్యయంతో ఆర్డీవో, తహశీల్దార్‌ల కార్యాలయ భవనాలను నిర్మించారు. సోమవారం ఆ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసమే కండలేరు జలాశం నుండి ఈ ఏడాది 1.80 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చామన్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకొని పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించామన్నారు. అధికంగా దిగుబడి అయిన మొక్కజొన్న, జొన్న, కంది, మిరప, వేరుశనగ తదితర పంటలు ఇతర రాష్ట్రాలకు అమ్ముకొనే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. రైతు రుణమాఫీకి మొదటిసారి సుమారు 14వేల కోట్ల రూపాయలు ఇచ్చామని, రెండోసారి 8వేల 100 కోట్లకు గాను 3300 కోట్లు ఇచ్చామన్నారు. మూడో విడతగా ఈ ఏడాది మరో 8వేల 100కోట్లు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాదితో మొత్తం 1.50 వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ కానుందన్నారు. ఆరు మండలాలతో ఏర్పడిన అతి చిన్న రెవెన్యూ డివిజన్‌లో అధికారులు సమస్యలు లేకుండా చూసుకోవాలని, వారి పదవులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. మరో నెల రోజుల్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తాని మంత్రి సోమిరెడ్డి తెలిపారు.
తెలుగు తమ్ముళ్ల అలక
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి స్థానికంగా తనకంటూ ఒక వర్గంగా ఉంటూ వస్తున్న మల్లెమాల రాఘవరెడ్డి అల్లుడు ప్రస్తుత జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు గూడూరు రఘునాధరెడ్డికి ఆహ్వానపత్రికలో స్థానం కల్పించకపోవడం ఆయన సభకు హాజరుకాలేదు. నిన్న మొన్నటి వరకు వైకాపా, కాంగ్రెస్ పార్టీల్లో ఉండి ప్రస్తుతం టీడీపీలోకి వచ్చిన వారికి స్థానం కల్పించి, సీనియర్ నాయకుడిని పక్కనపెట్టడంపై ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం గ్రహించిన మంత్రి సోమిరెడ్డి సభా కార్యక్రమాలు ముగించుకున్న తరువాత నేరుగా రఘునాధరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను బుజ్జగించి సూళ్లూరుపేట ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పరసా వెంకటరత్నంను మందలించారు. ఈకార్యక్రమంలో నాయకులు బీద రవిచంద్ర, వేనాటి రామచంద్రారెడ్డి, జడ్పీటిసి రాంప్రసాద్, ముప్పాళ్ల వెంకటేశ్వర్లు, మైలారి శోభారాణి, విజయభాస్కర్‌రెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, ఆర్డీవో శీనానాయక్, తహశీల్దార్ మైత్రేయ తదితరులు పాల్గొన్నారు.