శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మళ్లీ మద్యం బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 23: అమ్మకాలపై తమకిచ్చే మార్జిన్ మొత్తాన్ని పెంచాలని కోరుతూ మద్యం వ్యాపారులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా రాష్టవ్య్రాప్తంగా మద్యం డీలర్ల సంఘం పిలుపు మేరకు రేపటి నుండి జిల్లావ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిచిపోనున్నాయి. జిల్లాలో 330 మద్యం దుకాణాలు, 36 బార్లు ఉన్నాయి. బుధవారం వీటిలో మద్యం అమ్మకాలు నిలిపివేయబోతున్నారు. ప్రభుత్వం మద్యం అమ్మకాలపై 7 శాతం మార్జిన్‌గా ఇస్తోంది. అయితే ఈ మొత్తాన్ని 18 శాతానికి పెంచాలనేది మద్యం వ్యాపారుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న మార్జిన్ చాలా తక్కువగా ఉందని, దీనివల్ల మద్యం వ్యాపారులు నష్టపోతున్నారంటూ గత కొంతకాలంగా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో నాలుగు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేసిన మద్యం వ్యాపారులు మరోసారి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని జిల్లాల మద్యం డీలర్ల సంఘాలన్నీ ఏకతాటిపైకి రావడంతో ప్రభుత్వం దిగి వచ్చేవరకూ అమ్మకాలను నిలిపివేయనున్నట్లు మద్యం సిండికేట్ ప్రతినిధులు తెలిపారు. అసలే మార్జిన్ తక్కువగా ఇస్తూ మరోవైపు బెల్టుషాపుల తొలగింపు, నిర్దేశిత సమయపాలన వంటి నిబంధనలను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుండడం మద్యం వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. గతంలో మార్జిన్ అందుతుండడంతో పాటు క్వార్టర్‌పై ఎమ్మార్పీ కంటే రూ.10 నుండి రూ.20ల వరకూ వ్యాపారులు అదనంగా అమ్మేవారు. దీంతో గత రెండేళ్ల పాటు లాభాల పంట పండించుకున్న మద్యం వ్యాపారులకు 2017 అబ్కారీ సంవత్సరం నుండి కష్టాలు మొదలైనట్లు చెబుతున్నారు. రెండేళ్లపాటు లైసెన్స్ పొందిన వ్యాపారులకు మరో రెండు నెలల్లో ఒక ఏడాది పూర్తవుతుంది. ఇక మిగిలిన ఏడాది కూడా ఇదే తరహాలో మార్జిన్ ఇస్తే మద్యం వ్యాపారులు అప్పులపాలయ్యే పరిస్థితి వస్తుందని కొందరు మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. గతంలో రూ.65 లక్షల లైసెన్స్ ఫీజు ఉన్న నగరాల్లో ప్రస్తుతం రూ.14 లక్షలుగా నిర్ణయించామని, రూ.50 లక్షలున్న బార్ ఫీజును రూ.30 లక్షలకు తగ్గించామని, మార్జిన్ శాతాన్ని తగ్గిస్తే నష్టాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికంగా వసూలు చేసే మొత్తాన్ని ఎక్సైజ్, పోలీస్ శాఖలకు మామూళ్ల రూపంలో వెళ్తుండేవి. ఇది బహిరంగ రహస్యమే. అయితే ప్రస్తుతం నిబంధనలను కఠినతరం చేయడంతో అటు ఎక్సైజ్, ఇటు పోలీస్ అధికారులకు అందుతున్న మామూళ్లు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. మద్యం వ్యాపారుల నిరవధిక ఆందోళన వెనుక ప్రభుత్వానికి చెందిన కొందరు నేతలు, అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ అంశాన్ని ఆలోచించాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని మద్యం వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. మద్యం డిపోల్లోనూ కొనుగోళ్లను నిలిపివేసేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. అయితే మద్యం వ్యాపారులు చేస్తున్న ఆందోళన తనకు సమ్మతం కాదని, తనకు అందుతున్న మార్జిన్‌తో సంతృప్తి చెందుతున్నానని, తన దుకాణంలో విక్రయాలు యధావిధిగా కొనసాగుతాయని తమ్మినపట్నం మద్యం దుకాణ యజమాని స్పష్టం చేస్తుండడం కొసమెరుపు.