శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ముగిసిన కానిస్టేబుళ్ల బదిలీ ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 23: గత మూడు రోజులపాటు జరిగిన పోలీస్ కానిస్టేబుళ్ల బదిలీ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. గత బదిలీలకు భిన్నంగా ఎటువంటి పైరవీలకు చోటులేకుండా పారదర్శకంగా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఈ బదిలీలను నిర్వహించారు. ఏళ్ల తరబడి ఒకే సబ్ డివిజన్ పరిధిలోనూ, నెల్లూరు నగరంలోని పలు స్టేషన్లలోనూ పాతుకుపోయిన పలువురు కానిస్టేబుళ్లను ఎస్పీ దూరప్రాంతాలకు బదిలీ చేశారు. జిల్లాలోనే అత్యధికంగా నెల్లూరు 3వ నగర పోలీస్‌స్టేషన్ నుండి 20 మంది కానిస్టేబుళ్లు బదిలీ కావడం విశేషం. నెల్లూరు ఒకటో నగర పోలీస్‌స్టేషన్ నుండి 18 మంది, 2వ నగర, బాలలాజీనగర్ స్టేషన్ల నుండి 17 మంది బదిలీ కాగా, 4వ నగర స్టేషన్ నుండి 14 మందిపై బదిలీ వేటు పడింది. అవినీతికి ఆలవాలమైన ట్రాఫిక్, మహిళా పోలీస్‌స్టేషన్ల నుండి కూడా భారీగానే కానిస్టేబుళ్ల బదిలీ జరగడం గమనార్హం. బదిలీ సమయంలో నిర్దేశిత ప్రాధాన్యాతాక్రమాన్ని అనుసరించి కేటాయించబడే స్టేషన్ల వివరాలను డిస్‌ప్లేలో ప్రదర్శించి కానిస్టేబుళ్లను ఎంపిక చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ ప్రక్రియలో తొలిసారిగా బదిలీలు జరగడం, ఎటువంటి పొరపాట్లకు తావు లేకపోవడంతో ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. గతంలో బదిలీలు జరిగిన ప్రతిసారి పలు ఆరోపణలు వస్తుండేవి. అయితే ఈ దఫా జరిగిన బదిలీలు సక్రమంగా ఉన్నాయంటూ పోలీస్ సిబ్బందే పేర్కొనడం విశేషం.