శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రహదారి ప్రమాదాలు నివారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 23: రహదారి ప్రమదాలను నూరు శాతం తగ్గించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. స్థానిక దర్గామిట్టలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో 29వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఇప్పటికే పోలీస్, రవాణా అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిన జిల్లా అధికారులు రహదారి ప్రమాదాలను జిల్లాలో గణనీయంగా తగ్గించగలిగారని కొనియాడారు. రోడ్డు ప్రమాదాల్లో 28 శాతం ద్విచక్ర వాహన ప్రమాదాలే ఉంటున్నాయని, చోదకులు హెల్మెట్ తప్పక ధరించాలని ఆయన సూచించారు. అలాగే సీటుబెల్టు పెట్టుకొని కార్లలో ప్రయాణించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారిలో యువతే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఈనేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాహనాలు నడిపే విషయంలో తమ పిల్లలకు తగు జాగ్రత్తలు తెలియచేయాలని, నిబంధనలకు అనుగుణంగా ఉంచాలని సూచించారు. ప్రమాదాల నివారణకు సమష్టి కృషి అవసరమన్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వాహనాలు నడుపుతున్న వారి సహకారం కూడా ఎంతో అవసరమని గుర్తు చేశారు. వాహనచోదకులు తమ ప్రాణాలే కాకుండా ఎదుటి వారి ప్రాణాలు కూడా తమ చేతిలోనే ఉన్నాయనే విషయాన్ని గుర్తించి అప్రమత్తతతో వాహనాలు నడపాలని కోరారు. జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి నెల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా వాహనాలకు పార్కింగ్ స్థలాలు కల్పించామని చెప్పారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడపవద్దని, అటువంటి వారితో పాటు వారికి వాహనాలను ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అంతక్రితం రవాణా శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను మంత్రి ప్రారంభించి జిల్లాలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాలను పరిశీలించారు. అనంతరం భద్రతా వారోత్సవాల కరపత్రాలు, స్టిక్కర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ఎన్.శివరాంప్రసాద్, గూడూరు ఆర్టీవో చందర్, సీనియర్ ఎంవిఐ సీతారామిరెడ్డి, లారీ అసోసియేషన్ రాష్ట్ర నేత గోపాలనాయుడు, ప్రయివేటు పాఠశాలల తరపున మైథిలి మనోహర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.