శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సూళ్లూరుపేటలో పట్టపగలే చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 19: పట్టణంలోని పొట్టిశ్రీరాములు వీధిలో కాపురం ఉంటున్న డి.అరుణ, మునిరాజా ప్రభుత్వ ఉద్యోగుల ఇంట్లో బుధవారం చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగలు ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న 20 సవర్ల బంగారు ఆభరణాలతో పాటు 80 వేల రూపాయలు అపహరించుకుపోయారు. బుధవారం పట్టపగలే చోరీ జరగడంతో ఈ ప్రాంతంలో కలకలం రేగింది. అరుణ పట్టణంలోని సూళ్లూరు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా, భర్త మునిరాజా తిరుపతిలో వెటర్నరీ డాక్టర్‌గా పని చేస్తున్నారు. వీరు ఇద్దరూ బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. అరుణ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో భోజనానికి ఇంటికి రావడంతో తాళం పగలగొట్టి ఉంది. లోపల మంచంపై దుస్తులు, వస్తువులు చిందరవందరంగా పడేశారు. బీరువా తాళం తీసి అందులో వస్తువులు సైతం పడేసి ఉండడంతో భయాందోళనకు గురైంది. వెంటనే చోరీ జరిగిందని తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఇంద్రసేనారెడ్డి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి బాధితురాల నుంచి వివరాలు సేకరించారు. నెల్లూరు నుంచి వేలిముద్ర నిపుణులను రప్పించి వేలిముద్రలు సేకరించారు. ఇంట్లో మూడు గంటలు లేకపోవడంతో ఇదంతా పథకం ప్రకారమే చోరీ జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించి చోరీకి పాల్పడి ఉండడంతో పోలీసులు అన్నికోణాల్లో విచారిస్తున్నారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా సూళ్లూరుపేటలో వరుస చోరీలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంటి ముందు మోటారుసైకిల్ పెట్టినా, కాసేపు ఇంటికి తాళం వేసినా దొంగలు పడి దోచుకుపోతున్నారు. ఇదంతా నిఘా వైఫల్యంతోనే జరుగుతోందన్న విమర్శలున్నాయి. పోలీసులు పట్టణంలో ఎక్కడా కూడా అంతగా నిఘా పెట్టకపోవడంతో దొంగలకు కలిసొస్తోంది. సూళ్లూరుపేట పట్టణం సరిహద్దు కావడంతో చోరీలకు అనువుగా మారింది. అంతేకాకుండా ఇక్కడ చోరీలు పక్కా ప్రణాళికతో చేస్తుండంతో పోలీసులు అరికట్టలేకపోతున్నారు.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ
చిట్టమూరు, సెప్టెంబర్ 19: చిట్టమూరు మండలం మల్లాంలోని వల్లీదేవసేన సమేత సుబ్రమణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మూలంరాజు భానుప్రకాష్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ పాపారెడ్డి వెంకటసుబ్బారెడ్డి, కార్యనిర్వహణ అధికారి రమణారెడ్డి అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు.
* నేడు ధ్వజారోహణ
మల్లాం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 10గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ధ్వజారోహణం సందర్భంగా సంతానం లేనివారు కొడిముద్దను స్వీకరిస్తే సంతానభాగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఏటా ధ్వజారోహణం రోజున పెద్దఎత్తున దంపతులు తడిబట్టలతో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రదర్శనలు నిర్వహించి కొడిముద్దను ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ఏడాది ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరికీ కొడిముద్దను అందచేసేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించాలని ట్రస్టుబోర్డు చైర్మన్ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.

సముద్రంలో ఎగసిపడుతున్న కెరటాలు
వాకాడు, సెప్టెంబర్ 19: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మండలంలోని 13గ్రామాలకు అత్యంత సమీపంలో ఉన్న సముద్రంలో బుధవారం ఉదయం నుంచి కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఈ కారణంగా మత్స్యకారులు సముద్రంలో వేట కొనసాగించలేకపోయారు. అలల తాకిడికి సముద్రపు ఒడ్డున ఉన్న వేట సామగ్రి స్వల్పంగా దెబ్బతింది. చేపల వేట తప్ప మరే పనిలేని తమకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని వారు కోరుతున్నారు. అల్పపీడన ప్రభావం వలన తేలికపాటి జల్లులు కురిసాయి. ఈసారి వర్షాలు కురిస్తే పంటలు సమృద్ధిగా పండే అవకాశాలున్నాయి. భూగర్భజలాలు భారీగా తగ్గిపోవడంతో ప్రస్తుతం మండలంలో తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వర్ణముఖి నది ఒడ్డున వాకాడు, చిట్టమూరు, కోట మండలాల నుంచి ఫిల్టర్ పాయింట్ల ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. నదిలో 150 అడుగలకు భూగర్భజలాలు పడిపోవడంతో త్రాగునీరు కూడా సరఫరా కష్టంగా మారింది.