శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బరువెక్కిన నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 23 : రొట్టెల పండుగకు వస్తున్న భక్తులతో నెల్లూరు నగరం కిటకిటలాడుతోంది. నగరంలోని ఏ వీధి చూసినా దర్గాకు వస్తున్న భక్తులు తారసపడుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, కేరళ, చత్తీస్‌ఘడ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. గత మూడు రోజుల నుంచి నిత్యం సుమారు మూడు లక్షలకు పైబడే భక్తులు వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నగరంలోని హోటళ్లలో గదులన్నీ నిండిపోయాయి. వస్తున్న వారికి అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేసినప్పటికీ ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీని తట్టుకోవడం, వచ్చే వారందరికీ సరిపడా ఏర్పాట్లు చేయడం అధికారులకు తలకు మించినభారంగా మారింది. అయినప్పటికీ అధికారులు తమకు సాధ్యమైనంత మేర భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తీవ్రంగానే కృషి చేస్తూ యాత్రికుల అభినందనలు అందుకుంటుండటం విశేషం.
కిటకిటలాడుతున్న బస్టాండ్, రైల్వేస్టేషన్
రొట్టెల పండుగకు వస్తున్న, రొట్టెలు స్వీకరించి తిరుగు ప్రయాణంలో ఉన్న యాత్రికులతో నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ కిటకిటలాడుతున్నాయి. రొట్టెల పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటోంది. అయితే రైల్వేశాఖ మాత్రం ఎటువంటి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయకపోవడంపై యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలవుల సందర్భాల్లో ప్రత్యేక రైళ్లు వేసే రైల్వే శాఖ లక్షలమంది వచ్చే రొట్టెల పండుగ కోసం హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని యాత్రికులు అభిప్రాయపడుతున్నారు. రద్దీ వలన రైళ్లలో ఎక్కే సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా రైల్వే పోలీసులు ముందస్తుజాగ్రత్త చర్యలు తీసుకొని కొందరు సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరోవైపు రొట్టెల పండుగకు వచ్చే యాత్రికులను ఆటోవాలాలు అధిక వసూళ్లతో దోచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరులో సర్వీస్ చార్జ్ కింద రూ.10 తీసుకునే ఆటోవాలాలు ప్రస్తుతం టిక్కెట్ రూ.20 వంతున యాత్రికుల నుంచి వసూలు చేస్తుండటం గమనార్హం. మరో రెండు రోజుల పాటు నగరంలో ఇదే రద్దీ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.

పవన్‌కల్యాణ్ రాకతో కిక్కిరిసిన దర్గా ఆవరణ
నెల్లూరు సిటీ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ రొట్టెల పండుగకు వస్తారని తెలియడంతో రెండు రోజుల నుంచి యువత ఆయన రాకకోసం ఎదురుచూశారు. పవన్‌కల్యాణ్ ఆదివారం రొట్టెల పండుగకు హాజరవుతారని తెలియడంతో బారాషాహిద్ దర్గాకు యువత భారీఎత్తున ఉదయం నుంచే చేరుకున్నారు. పవన్ రాకతో దర్గా ప్రదేశం సందడిగా మారింది. యువత పవన్‌ను చూడడానికి ఎగబడటంతో వారిని నియంత్రించడానికి పోలీసులకు కష్టతరమైంది. పవన్‌కల్యాణ్ మధ్యాహ్నం మూడు గంటలకు బారాషాహిద్ దర్గాను దర్శించుకున్నారు. రొట్టెల పండుగ నిర్వహణ కమిటీ, మతపెద్దలు పవన్‌కు ఘనస్వాగతం పలికారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం వివిధ కార్యక్రమాలు పవన్‌తో జరిపించి ఆశీర్వాదాలు అందచేశారు. పవన్‌కల్యాణ్ వెంట ఆయన మిత్రుడు, సినీ నటుడు అలీ ఉన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా:పవన్
బారాషాహిద్ దర్గాను సహచర సినీనటుడు అలీతో కలిసి పవన్‌కల్యాణ్ దర్శించుకున్న అనంతరం పవన్ విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడిని కోరుకున్నానని చెప్పారు. అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉండాలనేది జనసేన నినాదమన్నారు. అనంతరం పవన్‌కల్యాణ్ స్వర్ణాల చెరువులో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రొట్టెను పట్టుకున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అభివృద్ధి పథంలో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

దారిచూపిన అధినేతపై నిందలు వేయడం తగదు
* పార్టీ వీడేటపుడు వాస్తవాలు మాట్లాడాలి
* బొమ్మిరెడ్డి వ్యాఖ్యలు అవాస్తవాలు
* బొమ్మిరెడ్డిపై కాకాణి ఆగ్రహం
వేదాయపాళెం, సెప్టెంబర్ 23: పార్టీలో సముచిత స్థానం కల్పించి, ఉన్నత పదవి కల్పించిన పార్టీ అధినేతపై జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నిందలు వేయడం తగదని వైకాపా జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. నగరంలోని వైకాపా జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఇచ్చిన బీ-్ఫంతో గెలిచి జగన్‌ను విమర్శించడం బొమ్మిరెడ్డికి సమంజసంకాదన్నారు. నాలుగేళ్లుగా పార్టీలో ఉండి పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన వ్యక్తి నాలుగేళ్లుగా పార్టీలో ఏం జరిగిందో వాస్తవాలు మాట్లాడాలే తప్పా అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. అనూహ్య పరిణామాల వల్ల వెంకటగిరి బాధ్యతలు మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పార్టీ అధినేత అప్పగించారన్నారు. వెంకటగిరి బాధ్యతలు నిర్వహిస్తున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని మనస్థాపానికి గురైన బొమ్మిరెడ్డి పార్టీపై, జగన్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవాలంటే రూ.50కోట్లు ఖర్చు అవుతాయని, అంతమొత్తం నీవద్ద ఉన్నాయా అని జగన్ అడిగినట్లు బొమ్మిరెడ్డి అస్యత ప్రచారం చేస్తున్నారన్నారు. వెంకటగిరి బాధ్యతలను ఆనంకు అప్పగించ ముందు వైఎస్ జగన్ స్వయంగా బొమ్మిరెడ్డికి ఫోన్‌చేసి కలవమని చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బొమ్మిరెడ్డి స్పందించకపోవడంతో ఆనంకు వెంకటగిరి బాధ్యతలు అప్పగించారన్నారు. పార్టీ మారాలనే ఉద్దేశ్యం ఉంటే పరవాలేదని, కానీ పార్టీపై, అధినేతపై తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య, నాయకులు మేరిగ మురళి, వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు.