క్రైమ్/లీగల్

ప్రేమ జంట అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, జూన్ 11: ఓ ప్రేమజంట అదృశ్యం కావడంతో యువకుడి తల్లిదండ్రులను నిర్బంధించడమే కాకుండా పోలీసులపై తిరుగుబాటు చేసిన సంఘటన కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరపురం గ్రామంలో సోమవారం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన చెన్నూరు హరికృష్ణ, అదే గ్రామానికి చెందిన ఒక బాలిక గత రెండు సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. అయితే సుమారు 45 రోజుల క్రితం హరికృష్ణ, ఆ బాలిక ఇంటి నుంచి పరారయ్యారు. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలిక అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇరువురి కులాలు వేరుకావడం, బాలిక కులస్థులు ఆ గ్రామంలో అధికంగా ఉండటంతో యువకుడి తల్లిదండ్రులను, వారి బంధువులను బాలిక బంధువులు వేధించడం మొదలుపెట్టారు. బాలిక బంధువుల వేధింపులను తట్టుకోలేక యువకుడి తల్లిదండ్రులు గత కొద్దిరోజుల నుంచి చిట్టేడులోని పాఠశాలలో తలదాచుకుంటున్నారు. బాలిక బంధువుల వేధింపులపై యువకుడి తల్లిదండ్రులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారిని గ్రామంలోకి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎస్సై నారాయణరెడ్డి సోమవారం యువకుడి తల్లిదండ్రులను వారి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు యువకుడి తల్లిదండ్రులను నిర్బంధించి పరారీలో ఉన్న ప్రేమజంటను తీసుకురానిదే వీరిని వదిలిపెట్టమని, వీరు తమ గ్రామంలోనే ఉండకూడదని పట్టుబట్టారు. దీంతో ఎస్సై బాలిక బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా పోలీసులపై వారు తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో పరిస్థితి ఉద్ధృతంగా మారింది. దీంతో ఎస్సై యువకుడి తల్లిదండ్రులను చాకచక్యంగా స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా బాలిక బంధువులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలిక బంధువులకు కొంతమంది టీడీపీ నాయకులు మద్దతు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

రూ.50 వేల గంజాయి స్వాధీనం
* ముగ్గురు నిందితుల అరెస్టు
చిల్లకూరు, జూన్ 11: విశాఖపట్నం నుండి చెన్నైకు ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో తరలిస్తున్న 50వేల రూపాయల విలువ చేసే గంజాయి బస్తాలను చిల్లకూరు పోలీసులు సోమవారం తెల్లవారుఝామున గూడూరు-కోట క్రాస్‌రోడ్డు వద్ద దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈసందర్భంగా గూడూరు డిఎస్పీ విఎస్ రాంబాబు చిల్లకూరు పోలీసుస్టేషన్‌లో విలేఖరులకు ఈ సంఘటన వివరాలు వెల్లడించారు. చిల్లకూరు మండలంలోని గూడూరు-కోట క్రాస్‌రోడ్డు వద్ద నిరోషమ్మ, రమణల ద్వారా విశాఖపట్నం నుండి గంజాయిని ఓ ప్రైవేటు బస్సులో తెప్పించుకొని వేలుపాండ్యస్ ఉదయ్ అనే వ్యక్తి ఆటోలో తన వద్దకు తెప్పించుకొని సదరు గంజాయిని నూర్‌నజీర్‌బాషా, నూర్‌మదార్‌బి అనే వ్యక్తుల ద్వారా అమ్మకాలు కొనసాగించేవారు. ఈనేపధ్యంలో గంజాయి బస్తాలను వేలుపాండ్యస్ ఉదయ్, నూర్‌నజీర్‌బాషా, నూర్‌మదార్‌బీలు ఆటోలో తరలిస్తుండగా డిఎస్పీకి వచ్చిన సమాచారం మేరకు గూడూరు రూరల్ సిఐ అక్కేశ్వరరావు, చిల్లకూరు ఎస్సై శ్రీనివాసరావులు తమ సిబ్బంది ద్వారా దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులతో పాటు ఆటోను కూడా స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు. వీటి విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారు లక్ష రూపాయలు ఉంటుందని అన్నారు. వీరిలో వేలుపాండ్యస్ తమిళనాడు రాష్ట్రం మధురైకు చెందినవాడు కాగా, మిగిలిన వ్యక్తులు కోట మండలానికి చెందినవారని పోలీసులు తెలిపారు.