క్రైమ్/లీగల్

తిరుమల దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డుప్రమాదంలో భార్యాభర్తల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లకూరు, నవంబర్ 10: దైవదర్శనం చేసుకుని స్వగ్రామానికి తిరిగివస్తున్న భార్యాభర్తలు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన సంఘటన పెళ్లకూరు మండలం పెసలగుర్రప్ప తోట వద్ద శనివారం మధ్యాహ్నం జరిగింది. నెల్లూరు నగర పరిధిలోని స్టోన్‌హౌస్‌పేటకు చెందిన గ్రంధి నాగేశ్వరరావు(63), గ్రంధి సులోచన (55) శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి శుక్రవారం ఉదయం నెల్లూరు నుంచి కారులో తిరుమలకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఈ దంపతులు తిరుమలలో బస చేసి శనివారం తెల్లవారుజామున యల్-1 దర్శనంలో భాగంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం కారులో బయలుదేరి తిరిగి నెల్లూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణం చేస్తున్న కారు శనివారం మద్యాహ్నం ఒంటిగంట సమయంలో పెళ్లకూరు మండల పరిధిలోని పెసల గుర్రప్పతోట గ్రామం వద్దకు చేరుకున్న సమయంలో అదుపుతప్పి జాతీయరహదారికి కుడివైపునకు వెళ్లి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న నాగేశ్వరరావు, భార్య సులోచన అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో నాయుడుపేట సీఐ మల్లికార్జునరావు, పెళ్లకూరు ఎస్సై షేక్ మహ్మద్ హనీఫ్ సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు, బంధువులకు పోలీసులు సమాచారం అందించి మృతదేహాలను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న యజమాని గ్రంధి నాగేశ్వరరావు నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందా, లేక ముందు వెడుతున్న వాహనాన్ని దాటే ప్రయత్నంలో అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టారా అనేని విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు. మృతుడు నాగేశ్వరరావు దంపతులకు కుమారుడు అరుల్, కుమార్తె హరిత ఉన్నారు. భార్యభర్తలు ఇద్దరు ప్రమాదంలో విగతజీవులుగా మారిన దృశ్యం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. పెళ్లకూరు ఎస్సై హనీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.