శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సీబీసీఐడి విచారణకు చర్యలు తీసుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాపూరు, ఆగస్టు 10: రాపూరు పోలీసుస్టేషన్‌పై దాడి ఘటనలో అక్రమ కేసులు బనాయించినవారికి న్యాయం చేస్తానని, అవసరమైతే సీబీసీఐడి విచారణకు చర్యలు తీసుకుంటానని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు స్పష్టం చేశారు. శుక్రవారం రాపూరు పట్టణంలో సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలీసుస్టేషన్‌పై దాడి సంఘటనపై సమగ్ర బహిరంగ విచారణ చేపట్టారు. ముందుగా విచారణ ప్రాంగణంలో ఉన్న పోలీసు యంత్రాంగాన్ని విచారణ జరుగుతున్న సమయంలో ప్రాంగణం వదిలి బయటకు వెళ్లాలని ఆదేశించారు. పోలీసుల ముందు బాధితులు తమ బాధలను చెప్పేందుకు భయపడతారని చెప్పడంతో అక్కడ ఉన్న పోలీసులు బయటకు వెళ్లిపోయారు. ముందుగా ఓ మహిళను పిలిచి జరిగిన సంఘటనపై చెప్పమని కోరడంతో తన భర్తకు ఈ దాడి ఘటనకు ఎలాంటి సంబంధం లేదని స్థానిక స్టేషన్‌కు తీసుకెళ్లిన తన భర్తను మాట్లాడి తీసుకొచ్చేందుకు తాను పోలీసుస్టేషన్‌కు వెళ్లగా అక్కడ పోలీసులు నానా దుర్భాషలాడుతూ భయబ్రాంతులకు గురిచేసి బయటకు పంపేశారని ఆమె ఆరోపించారు. మరో మహిళ మాట్లాడుతూ ఈ దాడి సంఘటనలో ఎలాంటి సంబంధం లేని తన తండ్రిని ఉద్దేశ్యపూర్వకంగా స్థానిక పోలీసులు పిలిపించారని, దాడి సమయంలో కుటుంబ సభ్యులతో ఇంట్లోనే తమతో ఉన్నారని చెప్పారు. అదుపులోకి తీసుకున్న తన తండ్రి డక్కిలి పోలీసుస్టేషన్‌లో ఉండగా రాపూరు ఎస్సై లక్ష్మణరావు డక్కిలి పోలీసుస్టేషన్‌కు వెళ్లి కొట్టాడని వెంటనే జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి ఏ పాపం చేయని తండ్రిని విడిపించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రాపూరు మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీదేవి మాట్లాడుతూ ఏమాత్రం సంబంధం లేని తన భర్తను పోలీసుస్టేషన్‌పై దాడి ఘటనలో రాపూరు ఎస్‌ఐ జి లక్ష్మణరావు ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించాడని ఆరోపించారు. అసలు దాడి జరిగిన రాత్రి వీడియో క్లిప్పింగులను సమగ్రంగా పరిశీలించి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైనే చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని, ఉద్దేశ్యపూర్వకంగా కేసుల్లో ఇరికించడం ఏమిటని ప్రశ్నించారు. నిన్నటివరకు రాపూరు ఎస్‌ఐగానే ఉంటున్న లక్ష్మణరావుపై ఫిర్యాదు చేసేందుకు ఎవరికీ ధైర్యం లేక ముందుకు రాలేకపోయారని, జిల్లా ఎస్పీ ఆదేశాలకు విఆర్‌కువెళ్లిన వెంటనే రాపూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపైనే ఇలా ప్రతాపాన్ని చూపించే ఎస్‌ఐ పనితీరుపై ఫిర్యాదులు అందాయని, ఒక ఎస్‌ఐ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేయడం బాధాకరమని తెలిపారు. జరిగిన సంఘటనపై ఢిల్లీ వెళ్లి రాష్టప్రతికి నివేదిక ఇస్తానని, ఈ అమాయక దళితులపై పోలీసులు జరిపిన దాడిని పార్లమెంట్‌లో చర్చకు వచ్చేవిధంగా కృషి చేస్తానని అన్నారు. జాతీయస్థాయిలో జరిగిన ఈ కమిషన్‌కు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ రాకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. శనివారం ఉదయం పది గంటలకు తాను జిల్లా జైలుకు వెళ్లి జైలులో ఉన్న వారందరిని విడివిడిగా పరామర్శిస్తానని, అవసరమైతే వైద్య బృందం సహకారంతో ఏమైనా గాయాలున్నాయా అని పరిశీలిస్తానని చెప్పారు. అవసరమైతే కేసులో ఉన్న వారందరిని విడిపించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. లేకుంటే సీబీసీఐడి విచారణకు తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ విచారణలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెట్రి సెల్వీ, జిల్లా అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ ఆంజనేయులు, నెల్లూరు ఆర్‌డిఓ హరిత, పలు దళిత సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.