శ్రీకాకుళం

ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలిః కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, ఆగస్టు 10:ప్రభుత్వ బడుల్లో విద్యను బలోపేతం చేసే బాధ్యత గురువులదేనని జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి స్పష్టం చేసారు. కాశీబుగ్గ టికె ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరులలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై సుమారు 60 వేల రూపాయలు ఏడాదికి వ్యయం చేస్తుందన్నారు. ఉన్నత వర్గాలకు ప్రైవేట్ స్కూళ్లులో చదివించడానికి ఆర్థికస్తోమత ఉంటుందని, బడుగు, బలహీనవర్గాలకు విద్యార్థుల చదువు భారం కాకూడదనే ధ్యేయంతో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉండేవారని, నేడు ప్రైవేట్ స్కూళ్లుపై విద్యార్థులు మొగ్గు చూపుతున్నారంటే ఆది కొంతమంది ఉపాధ్యాయుల లోపమన్నారు. ఇప్పుడున్న పరిస్థితి నుంచి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు శ్రమించాలని, విద్యార్థులకు ప్రాథమిక విద్య అవసరమన్నారు. విద్యార్థిని ర్యాంకులు, మార్కులు వంటి వాటికి యంత్రంగా మార్చకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. విద్యార్థులను యంత్రాలుగా తయారుచేస్తూ వారికి కేవలం చదువు మాత్రమే చెబుతున్నారు తప్పితే క్రీడలు తదితర అంశాలపై దృష్టి సారించడం లేదన్నారు. ప్రభుత్వ విద్య వ్యవస్థ బాగుపడితేనే సమాజం బాగుపడుతుందని, ఇంగ్లీషు మీడియం మాత్రమే విద్య కాదని, ఇంగ్లీషు ధారళంగా మాట్లాడితే వారి తల్లిదండ్రులకు సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలలు నుంచి ప్రభుత్వ పాఠశాలలో 9 వేల మంది చేరడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డి ఇవో సాయిరాం, డెప్యూటీ డి ఇవో మన్మధరావు, సర్వాశిక్షాఅభియాన్ పివో త్రినాధ్, ఆర్డీవో వెంకటేశ్వరరావు, ఎం ఇవోలు శ్రీనివాసరావు, నర్శింహులు, జోరాడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎంప్లాయిస్ యూనియన్ విజయం కార్మికులకు అంకితం
పలాస, ఆగస్టు 10: రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించడం వెనుక కార్మికులు అంకితభావంతో పనిచేయడమే విజయానికి కారణమని, దీనిని కార్మికులకు అంకితం చేస్తున్నామని ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దువ్వాడ శ్రీ్ధర్ అన్నారు. పలాస ఆర్టీసీ యూనియన్ ఎన్నికలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని డిపోల్లో రీజియన్, స్టేట్ సంఘాల్లో గుర్తింపు ఎంప్లాయిస్ యూనియన్‌కు గుర్తింపు దక్కడంతో పలాసలో శుక్రవారం విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. యూనియన్ అధ్యక్షుడు బెందాళం జగ్గారావు, కార్యదర్శిగా రామారావులు విజయం సాధించడంతో యూనియన్ న్యాయసలహదారుడు దువ్వాడ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేక్‌ను కట్ చేసి మిఠాయిలను పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్ మాట్లాడుతూ పలాస ఆర్టీసీ డిపో పరిధిలో వరుసగా ఐదుసార్లు విజయం సాధించడం వెనుక యూనియన్ కార్మికుల కార్యదక్షత అని అన్నారు. గత విజయంతోపాటు ఈ విజయం మరింత గురుతర బాధ్యత పెంచిందన్నారు. కార్మికులకు అన్యాయం జరిగితే యూనియన్ సభ్యులంతా ఏకతాటిగా ఉండి కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయిస్ యూనియన్‌కు గుర్తింపు రావడంతో కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు రాజారావు, చిన్న, సూర్యనారాయణ, ఎన్‌వి రావు తదితరులు పాల్గొన్నారు.

గ్రామదర్శినితో గ్రామ సమస్యలు పరిష్కారం: సీ ఇవో
పలాస, ఆగస్టు 10:గ్రామదర్శిని కార్యక్రమంతో గ్రామంలో అపరిష్క్రతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక అని సీ ఇవో నగేష్ అన్నారు. శుక్రవారం కేదారిపురం గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లుగా గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఇంకా భవిష్యత్తులో చేయాల్సిన అభివృద్ధి పనులుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహాలు అర్హులకు అందించడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్థార్ కల్యాణచక్రవర్తి, ఎంపీడీవో సూర్యనారాయణ, ఏవో నాగారాజు, ఎన్ ఆర్‌జి ఎస్ ఏపి ఎం హరికృష్ణ, ఐసీడీ ఎస్ పీవో రాజరాజేశ్వరీ, వెలుగు ఎపి ఎం జాంబవతి తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా, ఉల్లాసంగా గ్రామాల్లో క్రీడలు
జలుమూరు, ఆగస్టు 10:స్వాతంత్య్రదినోత్సవం వస్తుందనగానే సాంప్రదాయ పంగలకన్నా మిన్నగా గ్రామాల్లో,పాఠశాలలో పదిరోజులనుండి ఉల్లాసంగా, ఉత్సాహంగా క్రీడలు నిర్వహించుతున్నారు. మండల పరిథిలో జిల్లాపరిషత్ హైస్కూల్‌లో, ప్రాథమిక పాఠశాలలో వివిద ఆటలపోటీలు గత మూడురోజులుగా జరుగుతున్నాయి. ప్రకృతి సహకరించనందున మైదానం అనుకూలంగా లేని పాఠశాలలో గదుల్లో క్రీడలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి నేటివరకు ఈ ఉత్సాహాలు, ఉల్లాసాలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని పలువురు పెద్దలు అభినందిస్తున్నారు.