శ్రీవిరించీయం

మరణం ఎరిగిన డాక్టరు - నైపుణ్యం చూపిన ‘విగరు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మాత్రలు యిస్తాను, పదిహేను రోజులు వాడండి. తరువాత ముఖ్యవిషయం- ఫర్‌గెట్ ఎవెరిథింగ్ ఎబౌట్ యువర్ హార్ట్.. ఎనిమిది వారాలపాటు రోజుకు మూడు గ్లాసుల పళ్లరసం, రెండు పూటలా కప్పు మజ్జిగ అన్నం తినండి. గో టు భిమిలి ఏ కామ్ ప్లేస్. మీ అడ్రస్ ఎవరికీ తెలియనివ్వకండి. మీ భార్యనూ తీసుకువెళ్లండి మీతో. టేక్ కంప్లీట్ రెస్ట్. నాలుగు వారాల తరువాత నా దగ్గరకు మళ్లీ రండి. మాత్రలు వేసుకోవడం మరచిపోకండి’- ఇదీ ప్రిస్కిప్షన్. ఇచ్చినవాడు పెద్ద మెడికల్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్. ఈ ప్రిస్కిప్షన్ పొందిన మనిషి నాలుగు వారాల తరువాత ఓ వెయ్యి రూపాయలు చెక్కు పట్టుకువచ్చి సమర్పించుకున్నాడు.
వి.ఎ.బి.రామారావు ‘డాక్టర్ విఎబి కథలు’ అన్న పుస్తకంలో సంకలనం చేసిన కథానిక ‘ది లాస్ట్ కేస్’లోని సంఘటన ఇది. మనకు డాక్టర్ల గురించి కథలు వున్నా, వారి వైద్య విధానం, నిదానం గురించి తెలియచెప్పేవి బహు తక్కువ. అసలు ‘ప్రొఫెషనల్స్’ గురించి రాసిన కథలు చెలామణీ కాని పరిస్థితి కూడా ఉంది. ‘జన’ సంపర్కం తప్ప ‘మన’(సు) సంపర్కం వున్న కథలకు అంతగా విలువ ఇవ్వరు చాలామంది. అయినా యిటువంటి కథలు అతి అరుదుగా మన్నన పొందుతూ వుండడం చూస్తూనే ఉంటాం. చదువరులలో యింకా విజ్ఞత కొరవడని వాళ్లూ వుండనే వున్నారుగదా!
ఇంతకూ రుూ కథలో ముగ్గురు మూర్తులూ డాక్టర్లే. ఒకాయన ప్రొఫెసర్‌గా డాక్టర్లను తీర్చిదిద్దినవాడు అయితే తతిమ్మా యిద్దరూ ఆయన శిష్యులు. ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు. ప్రొఫెసర్‌గారికి కోపం జాస్తి. మెడికల్ ఎథిక్స్ పాటించని వాళ్లంటే వొళ్లు మంట. నోరు విప్పి వాళ్లను ఎడా పెడా వాయించి వేయడానికి వెరవడు. ఆయన దగ్గరకు విశ్వనాధరావు అనే డాక్టర్ ఫ్రెండ్‌ను తీసుకువెళ్లాడు. కరుణారావు ఇద్దరినీ బాగా పలుకరించి సలహాలు సంప్రదింపులు అయిన తర్వాత భోజనానికి కూడా వుంచేస్తాడు ప్రొఫెసర్. ఆయన భార్య మల్లికమ్మగారు యిలా ఫిర్యాదు చేస్తుంది. ‘చూడండి బాబూ, మీ ప్రొఫెసర్‌గారు ఆరోగ్యంగానే ఉన్నారంటారా? నే చెబితే వినిపించుకోరు. అంతా నవ్వులాటకింద తీసేస్తారు. గొంతు పట్టేసి రెండు నెలలయింది. ఆయాసం కూడా. మీరయినా చొరవ చేసుకుని...’ ప్రొఫెసర్‌గారు ‘ఏదో థ్రోట్ ట్రబుల్. అంతే. కొన్నాళ్లపాటు లిక్విడ్ డైట్. మీరు కానివ్వండి’ అని శిష్యులను భోజనం చేయించారు.
ఈ సంఘటన జరిగిన మూడు రోజులకు కరుణారావు, మిత్రుడు విశ్వనాధరావుకు ఉత్తరం వ్రాస్తాడు. ‘విభ్రాంతికరమైన వార్త. ప్రొఫెసర్ సూర్యనారాయణరావుగారు, ది గ్రేట్ మాన్ నిన్న సాయంకాలం దివంగతులైనారు. నేను కేన్సర్ సస్పెక్ట్ చేశాను. కాదు, ఎ లైటర్ స్ట్రోక్ ఆఫ్ ఎంజైనా. కొద్ది సెకండ్లలో మృత్యువు ఆయన గాంభీర్యాన్ని జయించి వేసింది. భార్య మల్లికమ్మగారి దుఃఖం మనం ఊహించలేం’. ఆ ఉత్తరం ఇంకా యిలా కొనసాగుతుంది. ‘‘సంవత్సరంగా ఆమె పోరు పెడుతూనే ఉన్నదట. ఆయన చెవిని పెట్టుకోలేదు. మరో విషయం- ఆయన చూసిన చివరి కేస్ నీదే! ... ఇపుడు జ్ఞాపకం వచ్చింది. ‘డోన్డ్ మిస్ థర్స్‌డే’’ అన్నారు నాతో. రాంచీలో వున్న అమ్మాయికీ, ఢిల్లీలో వున్న అబ్బాయికీ మొన్న శుక్రవారంనాటికి రమ్మని ఉత్తరం వ్రాశారట. మల్లికమ్మగారి దగ్గర కూర్చుని చుట్టూ పిల్లలతో చిరునవ్వులు కురిపిస్తూ ఊపిరి తీసుకున్నారట. అద్భుతమైన విషయం. ఆయన తన చివరి ఘట్టాన్ని అంత ఖచ్చితంగా అంచనా వేసుకోగలగడం. ఓ విశిష్టమైన వ్యక్తిని పోగొట్టుకున్నాం. ‘మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’. 1975లో రాసిన రుూ కథానిక గొప్ప డాక్టర్‌నూ, వృత్త్ధిర్మాన్నీ, మానవత ప్రదర్శనను కళ్లకు కట్టినట్లుగా సాగుతుంది. అనన్య సామాన్యమైన తెలుగు కథల్లో యిదొకటి.

--శ్రీవిరించి