శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఉన్నవారికిఁ జుట్టంబులున్నవారె
లేనివారికి ఁ జుట్టాలు లేనివారె
కలిమిలేములు గలియుచు వెలుగునటులఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈ లోకంలో సంపన్నులు సంపన్నులతోనే బంధుత్వాలను కలుపుకుంటున్నారు. అలాగే పేదవారికి పేదవారే చుట్టాలు అవుతారు కానీ సంపన్నులు వీరిని కనె్నతె్తైనా చూడరు. సంపన్నవర్గం, పేద వర్గం అని రెండుగా చీలి విడివడి ఉండడం ఎంత వరకు సమంజసం? ఉన్నవాళ్లు లేనివాళ్లకు డబ్బుపరంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే లేనివాళ్లు ఉన్నవాళ్లకు వారి దగ్గర శ్రమించే శక్తిని దానం చేస్తే ఇలా ఒకరికొకరు పరస్పర సహకారాన్ని అందించుకుంటే ఎంత బాగుండు! ఓ సూర్యదేవా నీవే మాకు మంచిబుద్ధిని కలుగజేయుమయ్య.

తే.గీ. శక్తి సామర్థ్యములఁజూపి సాగవలయు
జిహ్వ చక్కంగ నాట్యమ్ము సేయవలయు
నటుల ఁ గాకున్నఁగష్టంబుల ధికమువౌను
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: అంతా తమ తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగిపోవాలి. నోరుందికదా అని అందునా నాలుక ఉంది కదాని నోటికి వచ్చినట్లు మాట్లాడకుండా మృదుమధురంగా ప్రీతిపూర్వకంగా మాట్లాడడం అలవర్చుకోవాలి. అలా కాని పక్షంలో కష్టనష్టాలు పెరిగిపోతాయని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవైనా తెలియజెప్పుమా లోకప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262