శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ జీవితపు బండ్లు నడుపంగఁ జేవఁ జూప
వలయు నైరాశ్యమొందంగ వలదు శిశిర
మది మరలిపోవ మధుమాసమాగమించు
నపుడు నానంద భాగ్యమ్మునందగలరు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవా!
భావం: జీవితాలనే బండ్లను అత్యంత శక్తి సామర్థ్యాలతో చక్కగా నడపాలి. అంతేగాని నిరాశ చెందకూడదు. జీవితమన్నాక కష్టనష్టాలు సహజం. శిశిరంలో ఆకులు రాలుతాయి. కానీ ఆ వచ్చేది వసంతమన్నది గ్రహించాలి. అప్పుడానంద భాగ్యాన్ని పొందగలరన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్య లోకబాంధవా!
తే.గీ కాలమాగదు విలువనుఁ గనుగొనంగ
వలయుఁ బెడచెవిఁ బెట్టినంబడెడి పాట్ల
నిన్నియన్నన రాదులే యెన్నఁదరమ?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కాలచక్రం ఎప్పుడూ తరుగుతూనే వుంటుంది. గడచిన కాలం రావాలంటే వస్తుందా? రాదు కదా! ఈ విషయాన్ని అంతా గ్రహించాలి. మంచి మాటలు పెడచెవిన పెట్టడంవల్ల మనం పడే పాట్లు ఇన్ని, అన్ని అని లెక్కించటం సాధ్యంకాదన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈ లోకానికి ప్రబోధించవయ్యా స్వామీ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262