శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కనగ కృష్ణుండు గోవులగా చెనిచట
అలరి గోప బాలుర తోడ నాడెనిచట
కృపను గోవర్థనా చలం బెత్తెనిచట
ననియు ఘనయము నా తటిననుదినమ్ము
స్వాంతమందున దలపోసి సంతసించు
భాగ్యమీవయ్య రసభావ! వాసుదేవ!
భావం : శ్రీకృష్ణుడు ఇక్కడే గోవులను గాచాడు. గోపాల బాలురతో కలసి ఇక్కడే ఆడుకున్నాడు. ఇక్కడే గోవర్థన గిరిని ఎత్తాడు. అని యమునా తీరాన్ని నిత్యమూ స్మరించి ఆనందించే భాగ్యాన్ని ప్రసాదించవా స్వామీ! వాసుదేవా! అని ప్రార్థించారు.
తే.గీ. చిన్ని పాదపద్మంబును చేత గొనియు
లీలగా హేలగ బొటన వ్రేలు, నోట
జేర్చి, హాయిగా నిదురించు క్షేమ దాయి
యైన వట పత్ర శాయికి నంజలింతు
భావం: తన చిన్ని పాదపద్మాన్ని చేతితో తీసికొని, బొటనవ్రేలిని నోటిలో ఉంచుకొని మఱ్ఱి ఆకుపై హాయిగా నిదురించు క్షేమంకరుడైన వటపత్ర శాయికి వందనం.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949