శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. పక్వమందిన మామిడి పండ్లకన్న
రసన కింపుగూర్చెడు ద్రాక్షరసము కన్న
ఆవుపాలతో జేయు పాయసము కన్న
నాణెమైనట్టి చెరకు పానకము కన్న
మాధవా! నీదు నామమే మధురతరము

భావం: మాధవా! మధుసూదనా! బాగా పండిన మామిడి పండ్లకన్నా మధురమైన ద్రాక్ష రసంకన్నా ఆవుపాల తో జేసిన పాయసం కన్నా చక్కని చెరకు పానకం కన్నా నీ నామమే మధురాతి మధురం.

ఉ. నీవొక బాలకుండవని, నిన్నొక రోటికి గట్టిరంచు మా
భావనలుండెగాని, మము పాపవిదూరుల జేయ నెంచియున్
ఈవిధి వచ్చి యుండిన యహీన కృపామతి వంచు నెంచమో
పావన మూర్తి, సర్వ సురవందిత సేవిత శ్రీరమాధవా!

భావం: నీవు మా వైపు వస్తుంటే నీవుబాలుడవనీ , నిన్నొక రోటికి కట్టివేశారనే అనుకున్నాం గానీ మామీద అపార కరుణతో మాకు శాపవిమోచనం కలిగించడానికి వచ్చిన మహావిష్ణువు అని గ్రహించలేకపోయాము. మమ్ములను మన్నించి బ్రోవుమయ్యా అంటూ బాలకృష్ణుని వేడుకున్నారా యక్షులు.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949