శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె. బ్రహ్మ కడిగినట్టి పామ్ముగలవాడు
సకల భువనములకు చక్రవర్తి
నన్ను పెద్ద జేసె నాభాగ్యవశమున
సురల కైన నిట్టి గరిమ గలదె
భావం: కుచేలుడు శ్రీకృష్ణుని ద్వారకలో సందర్శించినపుడు పరమాత్మ కుచేలుని అమితంగా గౌరవించాడు. తన హంసతూలికా తల్పం మీద ఈ బడుగు బాపణ్ణి కూర్చుండబెట్టి సపర్యలు చేశాడు. అపుడు కుచేలుడిలా భావించాడు.
సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కడిగిన పాదాలు కలవాడు, సకల లోక చక్రవర్తి యైన శ్రీకృష్ణుడు నన్ను పెద్ద జేసి గౌరవించాడు. అంటే అది నా అదృష్టం గాక మరేమిటి? ఇంతటి భాగ్యం దేవతలకైనా దక్కుతుందా?
తే.గీ. సతులు పదహారు వేలని సణుగువారు
భావ మెరుగంగ లేకయు పలుకు వారె
వలచి నిను జేర గొరిన వారె గాని
నీవు కోరిన వారేరి నీరజాక్ష
భావం: కృష్ణా నీకు పదహారు వేలమంది భార్యలని అనుకొనేవారే కానీ వారికి నీ అసలు తత్వం తెలియదు. ఐనా వారంతా నిన్ను కోరి వచ్చినవారే కానీ నీవుకోరిన వారు ఒక్కరన్నా ఉన్నారా? అని కవి ఆలోచిస్తున్నాడు.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949