శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోసలో చేదు దోసవలె దూరును నుత్తము పంచదుష్టుడున్
ఏ సమయమ్మునందొ నటు నేమరియుండ విషమ్ము జిమ్ము సా
వాసము జేత మంచియును వంచన బొందుగదమ్మ జూడగన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

సేసలు జల్లుచున్ శుభము జెప్పిరి పెద్దలు పెల్లినాడు నే
దోసరి లెమ్మటంచు నటు నూరక నేమరుపాటు జెందితిన్
మోసము జెందె నా బ్రతుకు ముక్త పథమ్మును తప్పిపోయితిన్
వాసర వాసినీ ప్రథిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!
వాసన లాను నాసిక సువాసనమే గ్రహియించు దుష్ట దు
ర్వాసన సోకినంతటనె బంధన సేయును ఘ్రాణ శక్తినిన్
అసరి జోడు యింద్రియముల య్యును నాలుక కర్ణ రంధ్రముల్
దోసపు మాటాడుచును దోసమునే వినగోరు నేలనో
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

కాసులు కాంచనమ్ములను గాదెల నిండుగ నింపి కొందరున్
మీసము బెంచి కొందరును మెండుగ కండలు బెంచి కొందరున్
ఈసును రోసమూని నశియింతురు మూలము నిన్ను గానకన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

-ఉమాపతి బి.శర్మ 9246171342