శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సతి యత్త గారగుట జేరగనీయదు మమ్ము నీదరిన్
అసతి పార్వతీ జనని యున్న భయంబును గల్గు చుండు రుూ
వాసర మువ్వురమ్మల నివాసము మూలపుటమ్మ వీవుగన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

భాసుర భాను బింబము నభంబున తేజరిలంగ తారకల్
తాసరి నిల్వ జాలని విధంబున జ్ఞాన గభస్తి మాలియు
ద్బాసితుడైన తక్షణమె దైహికమై హికమముల్ నశించెడున్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

వేసములెన్ని వేసినను వేసెడు వాడతడొక్కడే కదా!
బాసలు యెన్ని పల్కినను పల్కెడు నాలుక, యొక్కటే కదా!
ఆసరి తీరు జూడ జగమంతయు నొక్కటి తీరు వేరుగన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

మాసిన వల్వలట్లు తల మాసిన వానికి జీవనంబు దు
ర్వాసనలందు మ్రగ్గి తెలవారును పాపపు పంకిలమ్మునన్
ఏ సుగతిన్ వెలార్చటకు నెయ్యది లేదిక నీవే దిక్కు హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

-ఉమాపతి బి.శర్మ 9246171342