శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేలుకొలుపు
పల్లవి మేలుకో మాయమ్మ మేలుకోవమ్మ
మేలుకొని దయను మమ్మేలుకోవమ్మ
బ్రాహ్మీ మూహూర్తాన నాద బ్రహ్మము
ఏడేడు లోకాల తొలి కోడికూత
ద్వాదశాదిత్యులే ద్వారమ్ము చెంత
బాల కిరణాల నివ్వాళు లందింప
బ్రహ్మాది దేవతలు వందిమాగధులై
వేదాల వాదాలు వివరించి పాడ
సృష్టి నీ కడగంటి చూపు ప్రసరింప
సత్వభావము తోడ చైతన్య మంద
అండ పిండాది బ్రహ్మాండములన్ని
గుండెలో దాచుకొని కూర్చుందువంట
అండజేరిన కొడుకు గుండె గుడిలోన
ఉండవే శ్రీమాత ! జగదేక మాత!

-ఉమాపతి శర్మ 9246171342