శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా. శ్రీ మాతా! జగదేకమాత! రుచిరస్మేరానోపేత ! ని
ష్కామాభ్యర్చన సేసి కొల్చెదను శుష్కమ్మైన నా జీవితా
రామమ్మందున భక్తి పూర్ణ జలధారల్ ఏరులై పార వ
ర్షా మేఘమ్మవు కమ్ము తల్లి! చిగురించన్ భక్తి చైతన్యమున్

శా. తల్లీ నీ యొడిలోని బిడ్డలము కాదా మేము కాకున్న నే
తల్లీలన్ జగమందు నీ విధముగన్ తారాడుచున్నాము మే
మెల్లన్ నీదు అనుంగు బిడ్డలమె తల్లీ ! చిత్కలా రూప సం
పల్లీలా! దయజూపరావె జగదంబా! రాజరాజేశ్వరీ !
ఈ మహావిశ్వమ్ము నీ మాయ కాదా!
ఆ మాయలో పడిన ఆత్మజుడ నేను
కొడుకపై మాయ లాగూడదే తల్లీ!
మాయ మటు మాయమ్మ సేయగదవమ్మ
లోకాల నేలేటి లోకేశ్వరివి నీవు
శోకాల దేలేటి సుతుడనే నేను
మాకంటే రెప్పవై మమ్ము గాపాడ
మాకంటి వెలుగువై మమ్ము నడిపింప
ఎనె్నన్ని సారులో ఈభూమిమీద
పుట్టితిని గిట్టితిని మట్టిలో గలిసితిని
నీ ప్రేమ నోచని నిరుపేదనమ్మ
ప్రేమతో దయలుంచి పాలింప రమ్మా
మేలుకో మాయమ్మ మేలుకోవమ్మ
మేలు కొని దయను మమ్మేలుకోవమ్మ

-ఉమాపతి శర్మ 9246171342