శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. జననమ్మున్ మరణమ్ము లోకమున సాజవ్మౌను నే ప్రాంకిన్
జననమ్మందిన దాది మోహమయ సంసారమ్మునన్ జిక్కి నే
నని నా కూరిమి యాలు బిడ్డలని మిథ్యా జ్ఞాన వ్యాపారతన్
జనననీ! నిన్ను దలంప నైతిని కదా! శర్వాణి యేనాటికిన్

చదువులన్నియు నాకు సందేహమే నేర్పె
జ్ఞానమన్నది వట్టి అజ్ఞానముగ దోచె
అజ్ఞానమే నాకు ఆనందమమ్మా
అమ్మవై పూర్ణ బ్రహ్మానందమమ్మా

పాపమో పుణ్యమో పడితి సంసారాన
తాపత్రయాగ్ని నను దహియించుచున్నాది
ఎండి పోయెను తల్లి ! ఈ బ్రతుకు తోట
దందయలను కురిసి తలిరించనిమ్ము
పాపకూపమ్ములో పడిన వాడను నేను
తల్లి కోసము మిగుల తల్లడిల్లుచునుంటి
ఏడ్చి యేడిచి కొడుకు యెద ఎండి పోయంది
పలుకవా ఒకసారి లలితా భవాని
మేలుకో మాయమ్మ మేలుకోవమ్మ
మేలుకొని దయను మమ్మేలు కోవమ్మ

-ఉమాపతి శర్మ 9246171342