శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. భవచక్రమ్మది దిద్దరన్ దిరుగ విశ్వమ్మందు జీవుండనై
భవబంధమ్ముల చేత కట్టువడి విభ్రాంతుండవై విశ్వసం
భవ కర్మమ్ము నెరుంగలేక నొక బ్రహ్మాండాండ మందుండి శై
శవ లీలన్ గనులార్పు పక్షివలె నీ సంసారమున్ జూచితిన్

కారు చీకటిలోన తారాడు పసివాడు
ఏ రీతిగా దారి నెరుగునే యమ్మ
ప్రాపంచికమ్ముతో పని లేదు నాకింక
పిలుచుకొనవే తల్లి ప్రేమతో నీ వంక
కలిమాయ నిదురలో కలత జెందుచునుంటి
కలతలో తల్లికై కలవరించునుంటి
కలత నిద్దుర లేపి కలిమాయలను మాపి
తల నిమిరి కొడుకు వేదన తీర్పరావె

తల్లి! నీ యొడిలోని తనయుడను నేను
ఈ విశ్వమున బడితి త్రోవ దప్పితిని
వేదాల వాడలను వెతకి వేసారితిని
ప్రేమతో నీ వంక పిలుచుకనవమ్మ

-ఉమాపతి శర్మ 9246171342