శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేమియను మాట తన వీట లేక యుండ
నవ నిధుల నిల్పి సర్వమానవుల గాచి
ఎంచ సమసమాజమును సాధించినట్టి
ద్వారకా ధీశ్వరునకిదె వందనమ్ము
భావం: శ్రీకృష్ణుడు తన పురంలోనివసించేవారికి లేమి అన్నది ఉండకూడదనుకొన్నాడు. ‘శంఖనిధి’అనే దేవతను స్మరించాడు. ఆ నిధిదేవతల సర్వసంపదలను ఆ పురవాసులకు ఒసిగింది. అందరూ సిరిసంపదలతో తులతూగాలని నాడే సర్వసమృద్ధమైన సమ్మోదభరితమైన సమసమాజాన్ని స్వప్నించి నెలకొల్పిన ద్వారకాధీశ్వరుడైన కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తాను..
గోప సమితికి పెనుభీతి గూర్చినట్టి
దారుణ దవానంబును ద్రావి, హాల
హలమును హరియించిన పురహరుని వోలె
వరలిన మురళీధరునకు ప్రణతులిడుదు
భావం: ఒకానొకప్పుడు బృందావనంలో దారుణమైన దావాలనం ప్రజర్విల్లింది. గోవులు, గోపాలకులు భయభ్రాంతులయ్యారు. వారిని రక్షించటానికి హలాహాలాన్ని భక్షించిన పరమేశ్వరునిలాగా శ్రీకృష్ణుడు ఆ దావాలనాన్ని ద్రావి అందరినీ రక్షించాడు. ఆ మురళీధరునకు నమస్కారం.

- డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949