శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కప్పియుంచని వస్త్రాలు గట్టువారు
స్ర్తిపురుష భేదములులేకఁ దిరుగువారు
క్లబ్బులందునఁ గన్పట్టుఁ జబ్బులందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: నాగరిక సమాజంలో శరీరావయవాలు కనబడే విధంగా పారదర్శకమైన వస్త్రాలు ధరించేవారు, ఆడమగా అనే భేదభావాలను మరచిపోయి విచ్చలవిడిగా తిరిగేవారు, క్లబ్బుల్లోను, పబ్బుల్లోను, ఆడవాళ్లు కనబడుతున్నారే! ఇదేమి వింతకాలం.. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ ! చూడవయ్య!
తే.గీ. కనులు దెరవని పసికూన యనియునెంచఁ
బోక కామాంధకారానఁ బుణ్యభూమి
యులికి పడునట్లు గబళించెనొక్క మృగము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: నిండా ఆరునెలలు నిండని పసిపాపను కామాంధకారంతో కళ్లు మూసుకుపోయి పుణ్యభూమి ఉలిక్కిపడే విధంగా ఒక మృగం కబళించేసిందయ్యో! కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! (ఈ దారుణదుర్ఘటన కు నా హృదయంలో కలిగిన ఆవేదనా పూర్వక హృదయస్పందన)

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262