క్రీడాభూమి

శ్రీలంక ఎదురుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడో వన్డేలో న్యూజిలాండ్‌పై గెలుపు

నెల్సన్, డిసెంబర్ 31: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్‌పై శ్రీలంక ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూసిన లంక గురువారం నాటి మూడో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. లాహిరు తిరిమానే అజేయంగా 87 పరుగులు చేసి లంక విజయంలో కీలక భూమిక పోషించాడు. తిలకరత్న దిల్షాన్ 91, దనుష్క గుణతిలక 65 పరుగులతో తన వంతు సహకారాన్ని అందించారు. చివరిలో దినేష్ చండీమల్ (27 నాటౌట్) లంక విజయాన్ని పూర్తి చేశాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 276 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, టామ్ లాథమ్ (42), సాంట్నర్ (38) కొంత వరకూ లంక బౌలింగ్‌ను ప్రతిఘటించారు. మిగతా వారు అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో, ఒకానొక దశలో సులభంగానే 300 పరుగులు మైలురాయిని దాటుతుందని అనుకున్న లంక ఎనిమిది వికెట్ల నష్యానికి 276 పరుగులు చేయగలిగింది. నువాన్ ప్రదీప్, దుష్మంత చమీరతోపాటు ఈ మ్యాచ్‌తో వనే్డల్లో అరంగేట్రం చేసిన జెఫ్రీ వాండర్సే కూడా రెండు వికెట్లు కూల్చడం విశేషం. అతనికి లాథమ్, రాస్ టేలర్ వికెట్లు లభించాయి.
ఈ మ్యాచ్‌లో గెలిచి, సిరీస్‌ను చేజార్చుకోకుండా ఆశలను నిలబెట్టుకోవడానికి 277 పరుగులు చేయాల్సి ఉండగా, లంక ఓపెనర్లు దనుష్క గుణతిలక, తిలకరత్నే దిల్షాన్ మొదటి వికెట్‌కు 98 పరుగులు జోడించి, గట్టిపునాది వేశారు. మెక్‌క్లీనగన్ బౌలింగ్‌లో రాస్ టేలర్ క్యాచ్ పట్టగా అవుటైన గుణతిలక 45 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, నాలుగు ఫోర్లతో 65 పరుగులు చేశాడు. అనంతరం లాహిరు తిరిమానేతో కలిసి దిల్షాన్ రెండో వికెట్‌కు 211 పరుగుల అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని జోడించాడు. 92 బంతులు ఎదుర్కొన్న అతను తొమ్మిది ఫోర్లతో 91 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి చేయకుండానే రనౌటయ్యాడు. అనంతరం తిరిమానే, చండీమాల్ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, 46.2 ఓవర్లలో లంకను లక్ష్యానికి చేర్చారు. రెండు వికెట్లకు 277 పరుగులు చేసి లంక గెలిచే సమయానికి తిరిమానే 87, చండీమల్ 27 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 8 వికెట్లకు 276 (లాథమ్ 42, కేన్ విలియమ్‌సన్ 59, సాంట్నర్ 38, నువాన్ ప్రదీప్ 2/55, చమీర 2/38, వాండర్సే 2/55).
శ్రీలంక ఇన్నింగ్స్: 46.2 ఓవర్లలో 2 వికెట్లకు 277 (గుణతిలక 65, తిలకరత్నే దిల్షాన్ 91, తిరామానే 87 నాటౌట్, చండీమల్ 27 నాటౌట్).