అంతర్జాతీయం

28 మంది జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 13: భారత్‌కు చెందిన 28 మంది మత్స్యకారులను ఆదివారం శ్రీలంక నావికాదళ సిబ్బంది అరెస్టు చేశారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటి తమ దేశ జలాల్లోకి ప్రవేశించనందువల్ల భారత జాలర్లను అరెస్టు చేసినట్లు శ్రీలంక పేర్కొంది. శ్రీలంక ఇలా భారత జాలర్లను అరెస్టు చేయడం ఈ నెలలో ఇది నాలుగోసారి. పుదుకొట్టాయి, పంబన్, టుటికోరిన్‌లకు చెందిన ఈ మత్స్యకారులను శ్రీలంక నావికాదళ అధికారులు కంగెసంతురాయి ఓడరేవుకు తరలించినట్లు తమిళనాడు మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపినాథ్ తెలిపారు.