జాతీయ వార్తలు

శ్రీనగర్ గజగజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీవ్రంగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు
శ్రీనగర్, డిసెంబర్ 19: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ శుక్రవారం రాత్రి చలితో గజగజలాడింది. ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాశ్మీర్ లోయ మొతాన్ని మంచు కప్పేసింది. చలిగాలులతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీనగర్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 3.2 సెల్సియస్‌గా నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత అని వారన్నారు. ప్రముఖ సందర్శనీయ ప్రాంతమైన దాల్ సరస్సులో నీళ్లు గడ్డకట్టాయి. కాశ్మీర్ లోయకు ముఖ ద్వారమైన ఘాజిగంజ్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 3.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నాయి. టూరిస్ట్ రిసార్ట్ పహల్‌గావ్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 7.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారాలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. 4.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని కొకేర్‌నాగ్ పట్టణంలో 3.1 డిగ్రీల సెల్సియస్, స్కై రిసార్ట్‌గా పేరున్న గుల్‌మార్గ్‌లో మైనస్ 10.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి 10.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. లెహ్ ప్రాంతంలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. కార్గిల్ పట్టణంలో మైనస్ 10.2 డిగ్రీలుంది. రానున్న కొద్ది రోజులూ వాతావరణం పొడిగానే ఉంటుందని అధికారులు తెలిపారు.