రాష్ట్రీయం

ఏప్రిల్ 15న శ్రీరామనవమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 2: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 15వ తేదీన సీతారాముల కల్యాణ వేడుక శ్రీరామనవమి, మరుసటి రోజు 16న పట్ట్భాషేకం నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల తేదీలను ఖరారు చేస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 11వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 13న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, 14న ఎదుర్కోలు ఉత్సవం, 15న శ్రీరామనవమి స్వామి వారి తిరుకల్యాణం, 16న పట్ట్భాషేకం, 17న కల్యాణ రామునికి మహదాశ్వీరచనం ఇచ్చే సదస్యం, 21న చక్రతీర్థం, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు, శ్రీపుష్పయాగం ఉంటాయని దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి, స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు పొడిచేటి హరిజగన్నాథాచార్యులు తెలిపారు.