శ్రీవిరించీయం

ధనదాహం - దానవ లక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నారిగాడి చేత వౌనంగా తాళి కట్టించుకున్న ఆమెను చూసి ఎవరూ జాలిపడలేదు. మనసులోని హేళనను మాటలలో వెళ్ళగక్కారు. కనకానికి దగ్గరి సంబంధం నారాయణ. విరిసీ విరియని మనసులో వాడి చేయినందుకుని ఏడు అడుగులు వేసింది. నిజానికి నారాయణతో పెళ్లి ఆమెకు ఇష్టంలేదు. వాడు మంచివాడు అవడంవల్లను, ఆమె అంటే యిష్టం కావడంవల్లనో, పైసా కట్నం లేకుండా చేసుకున్నాడు. అది తనింట్లో దీపం వెలిగిస్తే చాలని మొహమటం లేకుండా ఊరంతా చాటాడు’.
వడలి రాధాకృష్ణ రాసిన కథానిక ‘ఎదిగిన మనిషి’లో సందర్భం ఇది.
ఇంతకూ నారాయణ ఎవరు? కనకం ఎవరు? వాళ్ల వైవాహ జీవితం ఎట్లా సాగింది? ఇదే కథా వస్తువు.
‘రెండు పూటలా గట్టిగా రెక్కలు విదుల్చుకొని రెండు చక్రాల బండి తొక్కితేగాని నాలుగు చేతులు లోపలికి వెళ్లని బతుకు నారాయణది. తన చిన్న బతుక్కు తోడు, తన సంపాదన ఇద్దరికీ తిండి పెట్టాలి. తన ఒళ్ళంతా కప్పుకోదగ్గ చిరుగులు లేని బట్టలు వేసుకోకపోయినా తనను నమ్ముకుని వచ్చినదానికి ఒంటినిండా కప్పుకునేందుకు బట్టలు కొనాలి. అవి పాలిస్టర్ అక్కరలేదు. మానాన్ని కాపాడే మామూలు బట్టలయినా చాలు. ఆ ఆలోచనలే వాడిచేత నాలుగు ట్రిప్పులు ఎక్కువ వేయించేవి- ఇదీ అతని పరిస్థితి.
పోతే కనకం చామనచాయ. అంత కురూపి ఏమీ కాదు. బాగానే వుంటుంది. కనకానికి నారిగానితో పెళ్లి కుదిరినపుడు అందరం ఆనందించారు. పెళ్లిలో వాళ్లను పక్క పక్కన చూచి ఆడ కాకికి తోడు మగ కాకి అంటూ వెక్కిరించారు.
తరువాత, పెళ్లయి నాలుగు నెలలయినా కనకం పక్కలోకి రానందుకు అసహనం వెళ్లబుచ్చలేదు, బుజ్జగించనూ లేదు నారాయణ. భార్య అంటే అభిమానంగా ప్రేమగా వుంటున్నాడు. ఆమె నిరాకరణను పెద్దగా మనసుకు తీసుకోవడంలేదు. ఆమెను సరదాగా సినిమాకు తీసుకు వెడదామనుకున్న అతని కోరిక నిరాశగానే మిగిలిపోయింది. కనకానికి శ్రీమంతుల జీవనశైలి పట్ల కోరిక ఎక్కువ. ఆమె ఇన్‌కమ్‌టాక్స్ ప్రాక్టీషనర్ కులకర్ణి యింటిలో పనికి చేరింది. కులకర్ణి అతని భార్య యిద్దరు పిల్లలు, ఒక తమ్ముడు వున్న చిన్న సంసారం. పొద్దున్న పాచి పని, అంట్లు తోమడం, వాషింగ్ మెషీన్‌లో పడేసి బట్టలు ఉతకడం- యిదీ పని ఆమెకు. నెలకు అయిదు వందలు ఇస్తానన్నారు. దీనికి తోడు కాఫీలు, టిఫిన్లు, టీవీ చూసే అవకాశం, ఫ్రిజ్‌లో నీళ్ళు తాగే సదుపాయం. కనకం కలలు నెరవేరుతున్నట్టు ఆనందంగా వుంది. ‘యజమాని అందం, పర్సనాలిటీ, తెలివితేటలు, వాక్చాతుర్యం, తమ్ముడితో బిహేవ్ చేసే విధానం ఆకట్టుకొంది ఆమెను. అందమైన మనుషులు, ఆనందమైన మనసులు, ప్రేమానురాగాలు, కలతలు లేని సంపూర్ణ కుటుంబంలో తనకు సౌకర్యమైన నౌకరీ దొరకడం ఆమెకు ఎంతో ఆనందంగా వుంది.
ఈ భోగభాగ్యాలు మనసుకు బాగా ఆవరించి, కనకానికి నారాయణను తన భర్తగా ప్రపంచానికి తెలియనివ్వడానికే గొప్ప ఆటంకంగా తయారైంది.
సజావుగా జరిగిపోతున్నది అనుకున్న ఇలాంటి స్థితిలో కనకానికి ఒక దుర్ఘటన తారసపడింది. యజమాని కులకర్ణి ఆమెకు డబ్బు ఎరజూపి లైంగికంగా వాడుకోవాలని ప్రయత్నం సాగిస్తాడు. ‘అయ్యగారు ప ట్నం సినిమాకు రమ్మంటున్నారు. పట్నంలో సిన్మాతో మంచి భోజనం- మరో చీర- మనసు ఆనందం ఒక్కటయిపోయాయి కనకంలో. అమ్మగారికి తెలియకుండా..! అది తప్పుగా అనిపించలేదు ఆ క్షణాన. కాదనటానికి కారణమూ కనిపించలేదు- కనకానికి.
యజమాని, యజమానురాలు మాట్లాడుకుంటున్న సంభాషణలు కనకం వినడం జరుగుతుంది. అది కులకర్ణి తమ్ముడి వివాహం గురించిన ప్రస్తావన- సాంబశివం అనే ఆయన వివాహ సంబంధం కుదుర్చుకుని, కట్నం డబ్బు లక్షన్నర రూపాయలు ముందుగానే ఇచ్చేశాడు. ఇప్పుడు జనకమూర్తి అనే ఆయన పది లక్షలు కట్నం ఇవ్వచూపడమే కాకుండా, ఎవరికీ తెలియకుండా కులకర్ణికి రెండు లక్షలు కమిషన్ కూడా ఇస్తానన్నాడు. ఆ దంపతులు ముందు నిర్ణయించుకున్న సంబంధం ఎలాగైనా ఆ అమ్మాయిని దుష్ప్రవర్తకురాలుగా చూపించి అనా సరే తప్పించుకుని రుూ కొత్త ఒప్పందానికి తలవొగ్గుతారు. అవసరం అయితే డబ్బు ఇచ్చి కిరాయి రౌడీలకు ఉపయోగించుకుందుకూ సిద్ధం అనుకుంటారు.
ఈ సంభాషణ విన్న కనకానికి వాళ్లు నిజాయితీ లేని మనుషులని తెలిసిపోయింది. గొప్ప కులపోళ్లని ఎప్పుడూ గొప్పగానే ఊహించుకుంది. ఎదిగిన మనుషులకు ఆలోచనలు కూడా ఎదిగినట్లుగానే వుంటాయనుకుంది. ఆ ఎరుపు రంగుల వెనుక, ఆ చదివిన తెలివితేటల వెనుక ఇంత కుత్సితం, ఇంత దగా వుంటుందనుకోలేదు’- కనకం ఈ సందర్భానికి అతుక్కోలేకపోయింది. ఇప్పుడు ఆమెకు నారాయణలో వున్న గొప్పదనం, ఉదాత్తత, భార్యపట్ల చూపే ఆపేక్షలో నిజాయితీ, ఆత్మీయత అర్థం అవసాగాయి. ‘ఈ ఎదిగిన మనుషుల వెనక ఇంత కుత్సితం వుంటుందని ఆమె ఊహించలేకపోయింది. నారాయణ, రిక్షా ఎక్కిన మనిషి పారేసుకున్న పర్సులో ఎన్నో వేల రూపాయలు వున్నా, వాటిని జాగ్రత్తగా స్వంతదారుకు అందించాలని ఆరాటపడి పరుగుతీస్తున్న నారాయణలో ‘ఎదుగుదల’, ఎత్తు కొట్టవచ్చినట్లుగా కనబడసాగింది. ఆమె మనసు మారిపోయి, హృదయం ద్రవించి నారాయణముఖాన్ని తన చేతుల మధ్యకు తీసుకుని నిమిరింది. అంతేకాదు, ‘సింగారించుకుని వస్తాను.. సిన్మా టికెట్లు తీసుకురా మావా!’ అని మొగుడిని మొదటి మారుగా ముద్దెట్టుకుని గుండెలకు హత్తుకుంది.
మనిషిలో ఎదుగుదల చదువు, గొప్ప ఉద్యోగంలో లేదనీ, అతని ‘నిజాయితీ’ ఒక్కటే మార్గదర్శక సూత్రం అవుతుందనీ, డబ్బుకు లొంగిపోయే మనిషి ఎప్పుడూ దురాలోచనకే దాసుడవుతాడనీ స్పష్టంగా చెప్పే కథానిక ఇది.

-శ్రీవిరించి