శ్రీవిరించీయం

వంకర టింకర మంత్రదండం -మానవ జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇరవై వసంతాల క్రితం వరదల్లో కొట్టుకపోయి, చనిపోయిందనుకున్న తన నాలుగేళ్ల కూతురు బ్రతికి బట్ట కట్టడమేమిటి? అదే కూతురు ఈ విశాల ప్రపంచంలో ఎవరూ లేనట్టు తన కొడుకును ప్రేమించడమేమిటి? అందరి పేరెంట్స్‌లా కాకుండా తమ కులం, గోత్రం కూడా చూడకుండా సంస్కారంతో పెళ్లి చేయడం ఏమిటి? ఇవన్నీ ఏమిటి?’
షష్ఠిపూర్తిచేసుకున్న దంపతులు శివరామ్, భ్రమరాంబలకు ఎదురైన మంత్రదండం యిది. జీవితం తాము గీసుకున్న సరళరేఖలాగా సజావుగా నడిచిపోవాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే అలా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? మంత్రగాడి చేతిలోని దండంలాగా అది ఎన్నయినా మలుపులు, కుదుపులు తీసుకువస్తుంది. వీటన్నిటినీ తట్టుకుని జీవన గమనం చేయడమే మనిషి సంపాదించే ‘అనుభవ జ్ఞానం’ అంతా!
డా పెళ్లకూరు (సోమిరెడ్డి) జయప్రద వ్రాసిన ‘బ్రతుకు నుడి’ అన్న కథానికలోని సన్నివేశం ఇది.
ఈ కథలో దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురూను. వాళ్లు కొడుకును తమ వెంట తీసుకుని, కూతురును ఒక స్నేహితుల యింట్లో సదుపాయంగా వుంచి బెంగుళూరు వెడతారు, ఒక వివాహ సన్నివేశం చూడటానికి. తీరా వాళ్లు తిరిగి వచ్చేటప్పటికి, స్వగ్రామంలో వరద బీభత్సం ఏర్పడిన కారణంగా వాళ్ల కూతురు, ఆమెకు సంరక్షకురాలుగా వుండిన స్నేహితురాలు ‘గీత’ చనిపోతారు. రకరకాలుగా జీవితాన్ని నిందించుకుంటూ, చివరకు సమాధానపడిపోయి బతుకు సాగిస్తూ వుంటారు దంపతులు. కొడుకుకు ప్రేమ వివాహం చేసి వ్యాపారం వప్పచెప్పుతారు. ఇలా జీవితం నడిచిపోతూ వుండగా ఒక స్నేహితుడు ఓ ఉదంతం మోసుకువస్తాడు. అదేమిటంటే- చనిపోయిందనుకున్న వాళ్ల కూతురు ఎవరో బెస్తవాళ్ల చేత రక్షింపబడి- ఆపైన ఒక గృహస్థుకు ఐదు వేల రూపాయలకు అమ్మేయడం జరిగింది. అట్లా మరో కుటుంబంలో పెరిగిన అమ్మాయి రుూ దంపతుల- స్వంత కూతురే అయినా- ఇప్పుడు ‘కోడలుగా రూపాంతరం సంబంధాంతరం సంపాదించుకుంది.
ఈ విషయం తెలుసుకున్న దంపతులు గొప్ప విచికిత్సలో పడిపోయారు. అన్యోన్యంగా వుంటున్న కొడుకు, కోడళ్లను విడదీసి వాళ్ల జీవితాలలో కల్లోలం తీసుకురావడమా- లేక దీనిని తమ గుండెల్లోనే దాచుకుని ఏమీ జరగనట్లు కథ నడపడమా? ఈ విషయం తమంత తాము నిర్ణయం చేసుకోలేక, కుటుంబ సలహాదారు ‘గాంధీ’ అనే అతన్ని ఆశ్రయిస్తారు. అతను చెప్పిన మాటలు యివి:
‘పాప పుణ్యాలకు నిర్వచనం యిదీ అని ఎవరూ చెప్పలేరు. ఎవరి మేధస్సుకు తోచింది వాళ్లు చేశారు. కాలాన్ని చాలా వెనక్కి నెట్టేస్తే ఆ రోజుల్లో రుూ నిషిద్ధాలేమీ లేవు. ఎవరు ఎవరితోనైనా సంసారం చేయొచ్చు. ఆ తర్వాత కొంత నాగరికత పెరిగాక- రెండు గ్రూపులుగా ఏర్పడి, ఏ గ్రూపువాళ్లు ఆ గ్రూపులో వాళ్లను పెళ్లిచేసుకోకూడదని నిబంధనలు నియమించుకున్నారు. రక్తసంబంధీకులు పుట్టిన బిడ్డలు అనారోగ్యంగా, అవకరాలతో పుడ్తారనే సైంటిఫిక్ నాలెడ్జి వాళ్లకు ఆ రోజుల్లో లేదు...’
అతడు యింకా లౌకికంగా యిలా అంటాడు: ‘అమ్మ చెల్లెలి బిడ్డ చెల్లెలైతే, తండ్రి చెల్లెలు బిడ్డ పెళ్లికి వరుస ఎలా అవుతుందమ్మా? వాటిని పాటించినంతకాలం ఇది పాపం కదా, మరప్చోండి’-
పాశ్చాత్య దేశాలలో ‘షకఒఆ‘ సిస్ట్ (వావివరుసలు పాటించని వివాహ వ్యవస్థ) ఒక సమస్యగా వుంది. ఇది మన దేశంలో ఆచారం / అనాచారం పొరల్లో దొర్లుతోంది.
ఆ దంపతులు తక్కువ సమయంలో రుూ జీవిత సమస్యను నిర్థారించుకోవలసి వస్తుంది. భర్త యేం నిర్ణయిస్తాడోనని భార్య, ఆమె ఏమి నిర్థారిస్తుందోనని అతను కొంతసేపు ఎదురుచూస్తూ కూర్చుంటారు. చివరకు కొడుకు, కోడలు (కూతురు?) రంగప్రవేశం చెయ్యడంతోనే ఆమె నిర్థారణకు వచ్చినట్లుగా కాస్త నిలదొక్కుకుని ‘అమ్మా! రాజీ! కాస్త మీ మామయ్యకు రెండు పుల్కాలు చేసి పెడ్తావా? నాకు నీరసంగా వుంది!’ అని శక్తి అంతా కూడదీసుకుని చెప్పగలుగుతుంది. ఈ మాటలే ఆమె తీర్పుగా తీసుకున్నాడు భర్త. ఆమెకు మాటలలో ఇలా చెప్పుతుంది ఆమె- ‘ఏమండీ! మనం- కూతురు దొరికిన ఆనందం అనుభవిద్దాం.. కోడలుగానే ఉండనిద్దాం! ఇన్నాళ్లూ మంచి కోడలు దొరికినా, నాలో నందుని (కూతురు వాళ్లు పూర్వం పెట్టుకున్న పేరు) పోగొట్టుకున్న దిగులు పచ్చిగనా వుంది. దానిని ఈరోజు మందు వేసి మాన్పుకుందాం-’’
ఎంతటి యిరుకు, బెరుకు వ్యవహారం అయినా జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూచి సమన్వయపరచుకోవడం అవసరం మాత్రమే కాక అవకాశం అయినది కూడా- అన్న విషయాన్ని కథానిక స్పష్టపరుస్తుంది. రచయిత్రి ‘పదును’గా రాసిన కథ ఇది.

-శ్రీవిరించి