శ్రీవిరించీయం

మంచితనం మరణించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తన ధ్యేయం ఒక్కటే. కొడుకును తన పనులు తను చేసే స్థాయికి తేవడం. దీనికోసం ఎన్ని సుఖాలనయినా త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు ఆనంద్. అతనితోపాటు అతని భార్య జయశ్రీ. కాలచక్రగమనంలో మరో రెండు సంవత్సరాలు దొర్లిపోయాయి. గిరీష్‌లో మార్పు రాలేదు. కాకపోతే వెస్టరన్ మ్యూజిక్ మాత్రం వినేవాడు. అతని గదిలో ఇరవై నాలుగు గంటలూ టేప్ రికార్డర్ పనిచేస్తూ వుండాలి. ఆగితే అతనికి కోపం వస్తుంది. ఏడుస్తాడు..’- ఇదీ ఆ దంపతుల ఇబ్బంది. ఆనంద్, జయశ్రీలకు స్పాస్టిక్ బాయ్‌గా పుట్టాడు గిరీష్. అనేక డాక్టర్లకు చూపిన తరువాత అతని పరిస్థితిలో ఏ మాత్రం మార్పు, ఎదుగుదల కనిపించలేదు.
ఉపద్రష్ట సాయి రాసిన కధానిక ‘మనిషికో తోడు’లో సన్నివేశం ఇది. ‘్భగవంతుడా! మా బాబును తీసుకుపోకూడదూ?’ అటు వానికీ సుఖం లేదు, మాకూ సుఖం లేదు’- అనుకుని భోరుమని ఏడవడం తప్ప యింకేం చేయలేని స్థితిలో వాళ్లు వుండగా ‘ఒక్క ఆదివారం, మధ్యాహ్నం ఆనంద్ ఇంటికి ఒక నడి వయస్కురాలు వచ్చింది. తన పేరు కామాక్షి అని పరిచయం చేసుకుంది’. దంపతులకు మాత్రం పనిమనుషులమీద నమ్మకం పోయింది అప్పటికే. ఎందుకంటే- యింతవరకూ ఎవరూ ఒకటి రెండు రోజులు కంటే ఎక్కువగా నిలవలేదు. కామాక్షి ఆ యింటి పరిస్థితులన్నీ అర్థం చేసుకుంది. ‘ఆ యింట్లో ఒక మనిషి అయిపోయింది. జయశ్రీకి కామాక్షి తోడబుట్టిన సోదరిలా అనిపించింది. అనురాగపూరితమైన కామాక్షి మాటలు జయశ్రీకి ఉపశమనం కలిగించాయి. స్పాస్టిక్ కుర్రవాళ్ల తల్లిదండ్రులకు- అనురాగం, అభిమానం నిలిపిన వారి ఓదార్పు పలుకులు ఎంత ఊరట కలిగిస్తుందో ఆ దంపతులు తెలుసుకున్నారు’.
ఇంటి పనులు చేయడంతోపాటు, గిరీష్‌ను లాలించడం కూడా నేర్చుకుంది కామాక్షి. కాని విధి విపరీతం. గిరీష్‌కు ఉన్నట్టుండి జ్వరం వచ్చి మూడో రోజున చనిపోయాడు. కామాక్షి ఆ దంపతులకన్నా ఎక్కువగా బాధపడింది. వారిని ఓదార్చింది.
ఆ తరువాత దంపతులకు ఎదురయిన ప్రశ్న: కామాక్షికి యింకా మన ఇంటి పని వున్నదా? ఆమె సేవలు ఇంతలో తొలగించివేయవచ్చునా?.. పైకి ఏమి అనుకున్నా చెప్పినా వాళ్ల అంతరంగాలలో మాత్రం కామాక్షి యింకా మనకు కావాలి- అన్న అభిప్రాయం గూడుకట్టుకొనిపోయింది. ఇంతలో వాళ్లకు- యిన్నాళ్లూ కామాక్షి చెప్పని ఆమె కథనం తెలిసివచ్చింది, ఆమెకు భర్త లేడు. కామాక్షి నెల నెలా తన జీతాన్ని మానసిక వికలాంగుల సంక్షేమ కేంద్రంలో వున్న కన్నకూతురు పాలన పోషణ కోసం హైదరాబాద్ పంపిస్తూ వుంది. ‘ఒక వికలాంగురాలి తల్లిగా ఆ బిడ్డను రక్షించడానికి మరో ఆధారం లేని కామాక్షి తన కథ చెప్పకుండా అంతటి దావానలాన్ని తనలో దాచుకుంటూ, ఆనంద్ దంపతులకు ఉపశమనాన్ని కలిగించింది. వారికి క్షణికంగా అనిపించింది కూడా, ఆ వికలాంగ అయిన అమ్మాయిని కూడా తమ ఇంటికి తీసుకువచ్చి కామాక్షితోపాటు పోషించాలని. కాని కామాక్షి ఇందుకు అంగీకారం తెలుపలేదు. ‘నా ఉద్యోగం తీసివేయకండి. మీకు ఇంకా వయసు వుంది. చనిపోయిన గిరీష్‌ను మరచిపోయి, రుూ మారు మంచి సంతానాన్ని కనండి. ఆ బిడ్డ పెంపకం బాధ్యత నాకు ఇస్తే మీరు చేసిన చేస్తున్న సహాయానికి రుణం తీర్చుకున్నట్లు అవుతుంది. నా బిడ్డను బతికించటానికి నాకు రుూ ఉద్యోగం కావాలి. ఇక మీరు నాకు చేసే గొప్ప సహాయం, మీ సంతానాన్ని నేనే పెంచాలి!’ అని కామాక్షి వాళ్లకు భరోసా, ధైర్యం ఇచ్చి నిలబడింది. మనుషులలో యింకా మంచితనం మరణించలేదని స్పష్టంగా సూటిగా చెప్పే రుూ కథానిక జీవితాలకు ఓ కొత్త ఆణిముత్యం.

-శ్రీవిరించి